గ్రాడ్యుయేట్ ఓటర్ల నమోదుకు చర్యలు..!

by  |
గ్రాడ్యుయేట్ ఓటర్ల నమోదుకు చర్యలు..!
X

దిశ ప్రతినిధి, హైదరాబాద్:

త్వరలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికలకు అర్హులైన ప్రతి ఒక్క గ్రాడ్యుయేట్ ఓటరుగా నమోదయ్యే విధంగా చూడాల్సిన బాధ్యత ప్రతి కార్పొరేటర్‎పై ఉందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పిలుపునిచ్చారు. సోమవారం లోయర్ ట్యాంక్‎బండ్‎లోని పింగళి వెంకట్రామయ్య ఫంక్షన్ హాల్‎లో జీహెచ్ఎంసీ పరిధిలోని కార్పొరేటర్లతో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు మహమూద్ అలీ, మల్లారెడ్డి, మేయర్ బొంతు రామ్మోహన్, ఎమ్మెల్సీలు, పలువురు కార్పొరేటర్లు పాల్గొన్నారు.

ఈ సందర్బంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. ప్రతి కార్పొరేటర్ తమ డివిజన్ పరిధిలోని గ్రాడ్యుయేట్‎లను గుర్తించి.. వారు ఓటరుగా నమోదు చేయించుకునే విధంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. వర్షాలు విస్తృతంగా కురుస్తున్నందున కార్పొరేటర్లు అప్రమత్తంగా వ్యవహరించాలని, ప్రజలకు అందుబాటులో ఉండాలని చెప్పారు. ఆయా డివిజన్ పరిధిలో పెండింగ్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని.., లేనిచో తన దృష్టికి తీసుకొస్తే అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

Next Story

Most Viewed