స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై వెనక్కి‘తగ్గేదేలే’

by srinivas |
Visakhapatnam Steel Plant
X

దిశ, ఏపీ బ్యూరో : విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్రం మళ్లీ పాతపాటే పాడింది. ప్రైవేటీకరణ విషయంలో వెనకడుగు వేసే ప్రసక్తేలేదని కేంద్రం మరోసారి తెగేసి చెప్పింది. స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరించాలన్న తమ నిర్ణయంలో ఎలాంటి మార్పులేదని కేంద్రం మరోమారు స్పష్టం చేసింది. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై మరో ఆలోచనకు తావులేదని కేంద్ర ఉక్కుశాఖ పార్లమెంటుకు వివరించింది. విశాఖ ఉక్కుపై ఉభయ సభల్లో ఎంపీల ప్రశ్నలకు లిఖితపూర్వక కేంద్ర ఉక్కుశాఖ సమాధానమిచ్చింది. ప్రైవేటీకరణతో ఉక్కు పరిశ్రమకు మరిన్ని పెట్టుబడులు వస్తాయని చెప్పుకొచ్చింది. ప్రైవేటీకరణ ద్వారా ప్లాంట్ విస్తరణకు అవకాశాలు వస్తాయి. ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఉద్యోగ అవకాశాలు కూడా పెరుగుతాయని కేంద్ర ఉక్కుశాఖ వివరణ ఇచ్చింది.



Next Story

Most Viewed