హైదరాబాద్‌లో రెండో అపోలో ఫెర్టిలిటీ సెంటర్ ప్రారంభం

72

దిశ, వెబ్‌డెస్క్: అపోలో హాస్పిటల్స్ గ్రూప్‌లో భాగమైన అపోలో ఫెర్టిలిటీ తన రెండో అతిపెద్ద స్వతంత్ర అత్యాధునిక సంతాన సాఫల్య కేంద్రాన్ని హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో ప్రారంభించింది. 7 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో అత్యాధునిక ఐవీఎఫ్ ల్యాబ్‌తో పాటు మెరుగైన ఆపరేషన్ థియేటర్, హెచ్‌పీఏ ఫిల్టర్ల వంటి సౌకర్యాలతో దీన్ని ప్రారంభించినట్టు అపోలో హాస్పిటల్ గ్రూప్ ఓ ప్రకటనలో తెలిపింది. సంతానసాఫల్యం కోసం ప్రయత్నిస్తున్న చాలామందికి ఆశాకిరణంగా ఈ ఫెర్టిలిటీ సెంటర్ ఉండనుందని, గతంలో కొండాపూర్‌లో అపోలో ఫెర్టిలిటీ తొలి సెంటర్‌ను ప్రారంభించినట్టు అపోలో హెల్త్ అండ్ లైఫ్ స్టైల్ లిమిటెడ్ గ్రూప్ సీఈఓ చంద్రశేఖర్ చెప్పారు. ఈ సెంటర్‌లో 6 వేల కంటే ఎక్కువ ఐవీఎఫ్ కేసులను నిర్వహించిన సుధీర్ఘమైన అనుభవం కలిగిన వైద్యులు, ఎంబ్రియాజిస్టుల బృందం ప్రపంచస్థాయి సేవలను ఈ సెంటర్‌లో అందించనున్నట్టు అపోలో హాస్పిటల్స్ గ్రూప్ వెల్లడించింది.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..