శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్.. ఏపీఎస్ఆర్టీసీ ద్వారా దర్శన టికెట్లు

by  |
ttd news
X

దిశ, ఏపీ బ్యూరో: శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం తీపికబురు చెప్పింది. భక్తుల సౌకర్యార్థం ఇకపై ఏపీఎస్ఆర్టీసీ ద్వారా కూడా స్వామి వారి దర్శనానికి టికెట్లు అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది. ప్రతీ రోజు వెయ్యి టికెట్లను ఏపీఎస్ఆర్టీసీ ద్వారా అందుబాటులో ఉంచనున్నట్లు టీటీడీ తెలిపింది. ఈ టికెట్లను ప్రతీ రోజు ఉ. 11 నుంచి సాయంత్రం 4గంటల లోపు టికెట్లను బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్‌లైన్‌లో బస్ టికెట్లు బుక్ చేసుకునే ప్రయాణికులు అదనంగా మరో రూ.300 చెల్లించి శీఘ్ర దర్శనం టికెట్లు పొందవచ్చని స్పష్టం చేసింది. ఇకపోతే ప్రస్తుతం తిరుమలలో రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనాలు, వీఐపీ దర్శనాలు మాత్రమే కొనసాగుతున్నాయి. కరోనా మహమ్మారి వల్ల ఏప్రిల్ నుంచి సర్వదర్శనం నిలిపివేశారు. అంతేకాదు ప్రత్యేక ప్రవేశ దర్శనాన్ని కూడా 5వేల మందికి కుదించింది టీటీడీ. ప్రస్తుతం రోజూ 18వేల వరకు భక్తులు శ్రీవారిని దర్శించుకుంటున్నట్లు అధికారులు చెప్తున్నారు. మెుత్తానికి ఏపీఎస్ఆర్టీసీ ద్వారా దర్శన టికెట్లు అందుబాటులోకి తీసుకురావడం పట్ల భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Next Story