అంగరంగ వైభవంగా శ్రీ వారి బ్రహ్మోత్సవం

113

దిశ, వెబ్ డెస్క్ : అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరిగింది. శ్రీవారి ఆలయంలో తొమ్మిది రోజుల పాటు ఏకాంతంగా జరిగే శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు సంపంగి ప్రాకారంలో వైఖాన‌స ఆగ‌మోక్తంగా బుధ‌వారం సాయంత్రం అంకురార్పణ భక్తుల నామస్మరణల మధ్య వైభవంగా నిర్వహించారు. అనంత‌రం సాయంత్రం 6 నుంచి రాత్రి 7 గంటల మధ్య ఆల‌యంలోని రంగ‌నాయ‌కుల మండ‌పంలోకి సేనాధిప‌తి వారిని వేంచేపు చేసి ఆస్థానం నిర్వ‌హించారు. అక్టోబరు 7గురువారం సాయంత్రం ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. అలంకారప్రియుడైన శ్రీవారి బ్రహ్మోత్సవాలకు సప్తగిరులు సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యాయి.

 

 

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..