భ‌ద్రాద్రి రాముడి కల్యాణానికి రావొద్దు

by  |
భ‌ద్రాద్రి రాముడి కల్యాణానికి రావొద్దు
X

దిశ‌, ఖ‌మ్మం: శ్రీరామ న‌వ‌మి వేడుల‌కు భ‌ద్రాచ‌లం ఆల‌యంలో అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. క‌రోనా వైర‌స్ వ్యాప్తి నేప‌థ్యంలో భ‌క్తులెవ‌రూ సీతారాముల కల్యాణానికి రాకూడ‌ద‌ని ప్ర‌భుత్వం ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. ప్ర‌భుత్వ ఆదేశానుసారం సీతారాముల క‌ల్యాణాన్ని నిరాండ‌బ‌రంగా నిర్వ‌హిస్తున్న‌ట్టు ఆల‌య అధికారులు, పూజారులు తెలిపారు. ఈ మేరకు దేవాదాయ శాఖ అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు. ఆల‌యంలోని అంత‌రంగిక క‌ల్యాణ‌ మంట‌పంలోనే వేడుక‌ను అతికొద్ది మంది ఆల‌య సిబ్బంది, అర్చ‌కులు, వేద‌పండితుల మంత్రోచ్ఛ‌ర‌ణ‌ల మ‌ధ్య నిర్వ‌హించ‌డం జ‌రుగుతుంద‌ని తెలిపారు. రాముల‌వారి క‌ల్యాణానికి భ‌క్తులెవ‌రూ రావ‌ద్ద‌ని, ప్ర‌సార మాద్య‌మాల్లో తిల‌కించాల‌ని స్ప‌ష్టం చేశారు.

ఎమ్మెల్యే పొదెం వీరయ్య ఆరా..!

ఈనెల 2న భ‌ద్రాచ‌లంలో శ్రీరామ న‌వ‌మి వేడుక‌ల‌ను పుర‌స్క‌రించుకుని బుధ‌వారం ఉదయం ఎమ్మెల్యే పొదెం వీర‌య్య ఏర్పాట్ల‌ను ప‌రిశీలించారు. దేవాదాయ శాఖ క‌మిష‌న‌ర్, ఈవో, ఏఈవోల‌తో మాట్లాడారు. ఆల‌యంలో చేప‌ట్టిన ఏర్పాట్ల‌ను అడిగి తెలుసుకున్నారు. కల్యాణానికి హాజరయే భ‌క్తులు సామాజిక దూరం పాటించేలా చ‌ర్య‌లు చేపట్టాల‌ని సూచించారు. అలాగే కల్యాణ తలంబ్రాలు పంచి పెట్టే విధానం, పట్టాభిషేకం ఏర్పాట్ల‌పై ఆరా తీశారు.

Tags: Sriramanavami, Bhadrachalam, tomorrow, mla PODEM VEERAIAH, PEOLE

Next Story