సీజనల్ వ్యాధులతో జర భద్రం: శ్రీనివాస్ గౌడ్

by  |
సీజనల్ వ్యాధులతో జర భద్రం: శ్రీనివాస్ గౌడ్
X

దిశ, మహబూబ్‎నగర్: వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ హితవు పలికారు. గతంలో కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు.. ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల 10 నిమిషాలు కార్యక్రమంలో భాగంగా.. హైదరాబాద్ ఎల్‌బీ స్టేడియంలో వర్షపునీరు నిల్వ ఉన్న ప్రాంతాలు, పూలతొట్టిల్లోని నీటిని క్రీడా మంత్రి స్వయంగా తొలగించారు. వీటితో పాటు స్విమింగ్ పూల్, క్రీడా మైదానంలో దోమల నివారణ చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. దోమల ద్వారా సంక్రమించే అన్ని రకాల సీజనల్ వ్యాధులతో పాటు డెంగ్యూ వ్యాధి బారిన పడకుండా కేటీఆర్ ఈ కార్యక్రమానికి పిలుపునిచ్చారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని.. ఇంటి పరిసర ప్రాంతాలను ఎప్పటికప్పుడూ శుభ్రం చేసుకోవాలని ఆయన సూచించారు.

Next Story

Most Viewed