త్వరలో పాలమూరుకు ఎయిర్‌పోర్టు.. పేరు ఫిక్స్ చేసిన మంత్రి

by  |
త్వరలో పాలమూరుకు ఎయిర్‌పోర్టు.. పేరు ఫిక్స్ చేసిన మంత్రి
X

దిశ ప్రతినిధి, మహబూబ్‎నగర్: ప్రతిరోజు.. ప్రతిక్షణం పాలమూరు అభివృద్ధి గురించే నా ధ్యాసంతా.. ఓ అని పిలిస్తే చాలు మీ చెంత వాలిపోతానని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఆదివారం మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో జరిగిన ఆర్యవైశ్య పట్టణ కమిటీ ప్రమాణ స్వీకారం, ప్రైవేటు పాఠశాలల ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డుల ప్రదానం, మహిళా రచయితల సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అవార్డుల ప్రదానోత్సవంతో పాటు పలు కార్యక్రమాలలో మంత్రి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2014కు ముందు, ఆ తర్వాత పాలమూరు రూపురేఖలు ఎలా ఉన్నాయో ప్రజలు గమనిస్తూనే ఉన్నారు.. ఉదయం లేచింది మొదలు రాత్రి 12 గంటల వరకు అహర్నిశలు మీసేవలో ఉంటున్నాను. ఆపద వచ్చినప్పుడు పిలిస్తే చాలు మీ చెంత వాలిపోతాం అని మంత్రి వెల్లడించారు. త్వరలోనే మణికొండ సమీపంలో మినీ ఎయిర్ పోర్ట్ ఏర్పాటు కానుందన్నారు. దీనికి మన్యంకొండ వెంకటేశ్వర ఎయిర్‌పోర్ట్ అని పేరు పెడతామన్నారు. ఈ కార్యక్రమాల్లో జడ్పీ చైర్ పర్సన్ సుధాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి, డీసీసీబీ వైస్ చైర్మన్ కోరమని వెంకటయ్య, మున్సిపల్ చైర్మన్ నర్సింహులు, ప్రైవేట్ పాఠశాల యాజమాన్యాల సంఘం జిల్లా అధ్యక్షుడు ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed