బీసీలంటే చులకన ఎందుకు..? కేంద్రంపై ఫైర్

by  |
బీసీలంటే చులకన ఎందుకు..? కేంద్రంపై ఫైర్
X

దిశ, తెలంగాణ బ్యూరో: బీసీలంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు అంత చులకన ఎందుకని రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజులు శ్రీనివాస్​గౌడ్​ మండిపడ్డారు. ప్రభుత్వాలకు బీసీల ఓట్లు అవసరం లేదా? అని ఆయన ప్రశ్నించారు. జనాభా లెక్కల్లో బీసీ జనగణను నిర్వహించాల్సిన అవసరం లేదని, కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో అఫిడవిట్​ దాఖలు చేయడాన్ని వ్యతిరేకిస్తున్నామన్నారు. దేశవ్యాప్తంగా అరవై కోట్ల మంది బీసీలు కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబడుతున్నారన్నారు. బీసీ జనాభా లెక్కలు తీస్తామని గతంలో చెప్పిన బీజేపీ ప్రభుత్వం.. ఇప్పుడు ఆకస్మికంగా వెనకడుగు వేయడం సరైన పద్ధతి కాదన్నారు.

హైదరాబాద్​ బీసీ భవన్​లో శనివారం జరిగిన బీసీ సంఘాల సమావేశంకు ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాజుల శ్రీనివాస్​గౌడ్​ మాట్లాడుతూ… రాబోయే రెండు సంవత్సరాల్లో సాధారణ ఎన్నికలు జరుగుతాయని, ఈ లోపల బీసీల లెక్కలు తీస్తేనే బీజేపీకి ఓట్లు వేస్తామన్నారు.

Next Story

Most Viewed