అమెజాన్ చర్యలపై మండిపడుతున్న శ్రీలంక.. ఆ బికినీలను బ్యాన్ చేయాలని హెచ్చరిక

by  |
srilanka warns amazon
X

దిశ, వెబ్‌డెస్క్: ఆన్‌లైన్ రిటైలర్ దిగ్గజం అమెజాన్‌పై శ్రీలంక ప్రభుత్వం మండిపడింది. తమ దేశం జెండా గుర్తుతో ముద్రించి ఉన్న బికినీలు, లోదుస్తువులు, డోర్ మ్యాట్లను బ్యాన్ చేయాలని కోరింది. ఇది తమ దేశ ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడమేనని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు వాషింగ్టన్‌లోని శ్రీలంక రాయభార కార్యాలయం అమెరికా ప్రభుత్వానికి ఫిర్యాదు చేసింది.

అమెజాన్ సంస్థ.. బికినీలు, డోర్ మ్యాట్‌లు, చెప్పులు, లో దుస్తువుల వంటి వాటిపై శ్రీలంక జాతీయ జెండాతో పాటు బుద్దిస్టుల బొమ్మలతో కూడిన ముద్రిస్తున్నది. ఆన్‌లైన్‌లో ఈ ఉత్పత్తులను అమ్ముతున్నది. దీంతో అక్కడి ప్రజానీకం ఈ చర్యలపై భగ్గుమంటున్నది. వీటిపై వెంటనే బ్యాన్ చేయాలని ఇప్పటికే సోషల్ మీడియాలో పలువురు క్యాంపైన్ కూడా మొదలుపెట్టారు. నిషేధం విధించకుంటే ప్రజల ఆగ్రహాన్ని చవి చూడాల్సి వస్తుందని శ్రీలంక ప్రభుత్వం కూడా అమెజాన్‌ను హెచ్చరించింది.

మరోవైపు చైనా, అమెరికా వంటి దేశాల వద్ద శ్రీలంక చేస్తున్న అప్పుల కారణంగానే బడా కంపెనీలు ఈ చర్యలకు పాల్పడుతున్నాయనే వాదన వినపడుతున్నది. ఇదే విషయమై ఒక నెటిజన్ స్పందిస్తూ.. ‘మేము అప్పులు చెల్లించకుంటే భవిష్యత్తులో మా జెండాను టాయిలెట్ పేపర్‌పై కూడా ప్రింట్ చేస్తారు..’ అని వాపోయాడు.

Next Story