పేదలకు ప్రభుత్వం అండ: శ్రీదేవి

by  |
పేదలకు ప్రభుత్వం అండ: శ్రీదేవి
X

దిశ, న్యూస్‌బ్యూరో: లాక్‌డౌన్ సమయంలో వ‌ల‌స కార్మికులు, అనాథ‌ల‌కు ప్ర‌భుత్వం అండ‌గా నిలుస్తోన్నద‌ని మేయ‌ర్ స‌తీమ‌ణి బొంతు శ్రీ‌దేవి యాద‌వ్ తెలిపారు. సికింద్రాబాద్ జోన్‌లో వివిధ ప్రాంతాల్లో ఆక‌లి తీర్చుకునేందుకు దాత‌లు చేసే అన్న‌దానం కొర‌కు వ‌చ్చిన మూడొందల మంది వ‌ల‌స కార్మికుల‌ను పున‌రావాస కేంద్రాల‌కు త‌ర‌లించి జీహెచ్ఎంసీ ద్వారా భోజ‌న వ‌స‌తుల‌తో పాటు ఆరోగ్య సంర‌క్ష‌ణ చ‌ర్య‌ల‌ను చేప‌డుతున్నారు. ఈ సంద‌ర్భంగా వారి ఆక‌లిని తీర్చేందుకు మేయ‌ర్ స‌తీమ‌ణి శ్రీ‌మ‌తి బొంతు శ్రీ‌దేవియాద‌వ్ ఇంటి నుంచి వండి తెచ్చిన ఆహార‌ ప‌దార్థాల‌ను వ‌ల‌స కార్మికుల‌కు వ‌డ్డించారు. ఉద‌యం అల్పాహారంతో పాటు, రెండు పూట‌ల భోజ‌నాన్ని అందించే ఏర్పాట్ల‌ను చేయ‌నున్న‌ట్లు తెలిపారు. చిన్న,చిన్న దుకాణాలు, రోడ్ల ప‌క్క‌న చిరు వ్యాపారులు, హోట‌ల్స్‌, లాడ్జిలు, తోపుడు బండ్ల వ‌ద్ద స‌హాయ‌కులుగా ప‌నిచేస్తున్నార‌ని, ఇటువంటి వ్య‌క్తులు ఆయా ప‌ని ప్ర‌దేశాల్లోని రాత్రిపూట బ‌స చేస్తుంటార‌ని తెలిపారు. రోజురోజుకూ క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతున్నందున అన్ని ముందు జాగ్ర‌త్త‌లు ప్ర‌భుత్వం తీసుకుంటున్న‌ట్లు తెలిపారు. వ‌ల‌స కూలీల‌కు రెండు పూట‌లా భోజ‌నం పెట్టేందుకు ముందుకు వ‌చ్చిన దాత‌లు శ్రీ‌నివాస్‌, సాగ‌ర్‌ల‌ను అభినందించారు. శ్రీ‌నివాస్ రైల్వే ఎల‌క్ట్రిక‌ల్ విభాగంలో ప‌నిచేస్తుంటారు. మ‌రో దాత సాగ‌ర్ రాంకోటి ప్రాంతంలో వ్యాపారం చేస్తుంటారు.

Tags: Lockdown, GHMC Mayor Satimani, Secunderabad, Sridevi, Meal, Helping

Next Story

Most Viewed