IND Vs SL : టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక

by  |
IND-vs-sl
X

దిశ, వెబ్‌డెస్క్ : శ్రీలంకలోని ప్రేమదాస స్టేడియం వేదికగా భారత్-శ్రీలంక మధ్య మొదటి వన్డే మ్యాచ్ జరుగుతోంది. తొలి వన్డేలో టాస్ ​గెలిచిన లంక బ్యాటింగ్ ​ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో భారత జట్టులోకి ఇషాన్ కిషన్, సూర్యకుమార్​యాదవ్ అంతర్జాతీయ​ వన్డేల్లో అరంగేట్రం చేయనున్నారు. ఈ సిరీస్‌కు ధావన్‌ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో ధవన్‌తో పాటు పృద్వీ షా ఓపెనింగ్‌కు దిగనున్నాడు.

ఇండియా టీం : శిఖర్ ధావన్(కెప్టెన్), పృథ్వీషా, ఇషాన్ కిషన్, మనీష్ పాండే, సూర్యకుమార్​ యాదవ్​, హార్దిక్ పాండ్య, కృనాల్ పాండ్య, భువనేశ్వర్ కుమార్, దీపక్ చాహర్, భువనేశ్వర్​ కుమార్​, చాహల్,​ కుల్దీప్ యాదవ్.

శ్రీలంక టీం : అవిష్క ఫెర్నాండో, మినోద్​ భునుక, భనుక రాజపక్స, ధనంజయ డిసిల్వా, చరిత అసలంక, దసన్ శనక(కెప్టెన్), వనిందు హసరంగ, చమిక కరునారత్నే, ఇసురు ఉడానా, దుస్మంత చమీర, లక్షన్​ సండకన్​.


Next Story