- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
SRH స్టార్ బౌలర్ ఐపీఎల్ నుంచి అవుట్.. రంగంలోకి మరో యువ బ్యాటర్

దిశ, వెబ్ డెస్క్: ఐపీఎల్ 18వ సీజన్ రసవత్తరంగా కొనసాగుతోంది. మొదటి 15 మ్యాచుల్లో భారీ విజయాలను అందుకున్న కుర్ర జట్లు.. చివరి 10 మ్యాచుల్లో తడబడుతున్నాయి. ఈ సీజన్ లో భారీ ఓటములను చవిచూసిన కీలక జట్లు అయిన ముంబై, సన్ రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad), చెన్నై జట్లు వరుసగా విజయాలను సాధించిన తిరిగి ఫామ్ లోకి వచ్చాయి. దీంతో ఐపీఎల్ 2025 తీవ్ర ఉత్కంఠ గా మారింది. ఈ క్రమంలోనే సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు భారీ షాక్ తగిలింది. ఇప్పటికే బౌలింగ్ విభాగంలో వీక్ గా ఉన్న హైదరాబాద్ నుంచి స్టార్ బౌలర్ ఆడమ్ జంపా (Adam Zampa) గాయం కారణంగా ఐపీఎల్ (Out of IPL) మొత్తానికి దూరం అయ్యాడు.
చేతి వేలికి గాయం తీవ్రతరం కావడం.. ఆయనకు పూర్తి రెస్ట్ ఇవ్వాలని డాక్టర్లు తెలపడంతో జట్టు యాజమాన్యం జంపాను తిరిగి ఆస్ట్రేలియాకు పంపినట్లు తెలుస్తుంది. కాగా అతని స్థానంలో కర్ణాటకకు చెందిన యువ బ్యాటర్ ఆర్ స్మరన్ (R Smaran) SRH లో చేరాడు. 21 ఏళ్ల స్మరన్ ఇంతకు ముందు IPLలో ఆడలేదు. కానీ అతను కర్ణాటక తరుఫున దేశవాలి మ్యాచుల్లో మంచి ఫామ్ కనబరిచాడు. దీంతో అతని బేస్ ధర INR 30 లక్షలతో SRH జట్టులోకి తీసుకుంది. కాగా చివరి మ్యాచులో సన్ రైజర్స్ జట్టు 246 పరుగుల లక్ష్యాన్ని చేధించి చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే.