రైనాను ట్రోల్ చేసిన యువరాజ్.. వైరల్ అవుతున్న వీడియో

by Vinod kumar |   ( Updated:2022-05-13 17:28:51.0  )
రైనాను ట్రోల్ చేసిన యువరాజ్.. వైరల్ అవుతున్న వీడియో
X

ముంబై: చెన్నై సూపర్ కింగ్స్ మాజీ ఆటగాడు సురేశ్ రైనాను టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ ట్రోల్ చేశాడు. బుధవారం రాత్రి జరిగిన మ్యాచ్ లో సీఎస్కే జట్టు ముంబై చేతిలో కేవలం 97 పరుగులకే ఆలౌట్ అయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో యువరాజ్ సింగ్ సురేశ్ రైనాను ట్రోల్ చేసిన వీడియోను పోస్ట్ చేశారు.' చెన్నై సూపర్ కింగ్స్ 97 పరుగులకే ఆలౌట్ అయ్యింది. దీనిపై నువ్వు ఏమంటావు అని యువీ రైనాను అడిగాడు. నేను మ్యాచ్ చూడలేదు పాజీ అంటూ' మాజీ సీఎస్కే ప్లేయర్ రైనా రిప్లై ఇచ్చాడు. ప్రస్తుతం యువీ షేర్ చేసిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. కాగా, గత ఏడాది ఐపీఎల్ సీజన్లో కరోనా కారణంగా రైనా యూఏఈలో మ్యాచ్ ఆడేందుకు నిరాకరించాడు. అయితే, ఈ ఏడాది ఐపీఎల్ వేలంలో సీఎస్కే రైనాను రిటెన్షన్ చేసుకోలేదు కదా.. కనీసం తిరిగి దక్కించుకునేందుకు పెద్దగా ఆసక్తి చూపించలేదు.


Advertisement

Next Story

Most Viewed