- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
పరుగులపై శ్రద్ధ పెట్టు.. అభిషేక్ శర్మకు యువీ బర్త్ డే విషెస్
దిశ, స్పోర్ట్స్: సన్ రైజర్స్ స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ (23)వ పుట్టిన రోజు సందర్భంగా అతని మెంటార్ యువరాజ్ సింగ్ సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. ‘హ్యాపీ బర్త్ డే అభిషేక్’. ఈ ఏడాది నువ్వు మరిన్ని సింగిల్స్ తీస్తావని ఆశిస్తున్నాను. కష్టపడి పని చేస్తూనే ఉండు’ అనే యువీ రాసుకొచ్చాడు. ఐపీఎల్ 17వ సీజన్‌లో భారీ హిట్టింగులతో బౌలర్లను అభిషేక్ బెంబేలెత్తించిన విషయం తెలిసిందే. హైదరాబాద్ జట్టు సాధించిన అత్యధిక లీగ్ మ్యాచ్ విజయాల్లో అభిషేక్ కీలక పాత్ర పోషించాడు. అదే సీజన్‌లో ఏకంగా 41 సిక్సులు కొట్టిన అతను.. ఆ సీజన్‌లో అత్యధిక సిక్సులు బాది ఏకంగా విరాట్ కోహ్లీ (2016లో 38 సిక్సర్లను) అధిగమించిన బ్యాటర్‌గా పేరు సంపాదించాడు.
ఇక ఆ తర్వాత అతనికి టీమిండియాలో అవకాశం రాగా, జింబాబ్వేతో జరిగిన తొలి టీ20లో అభిషేక్ శర్మ డకౌట్‌గా వెనుదిరిగాడు. ఇక 2024లోనూ సన్ రైజర్స్ జట్టు తరఫున అద్భుత ప్రదర్శన చేసి టీ20ల్లోకి అడుగుపెట్టాడు. అయితే, తొలి మ్యాచులోనే ఫ్యాన్స్‌ను నిరాశ పరిచిన అభిషేక్.. ఈ విషయంపై మాట్లాడుతూ..‘నేను డకౌట్ అయినా.. మెంటార్ యువరాజ్ ఎందుకు సంతోషించారో తెలియదు గానీ, మంచి ప్రారంభం అని ప్రోత్సహించారు. ఆయన నాకు మెంటార్ గానే కాకుండా జీవితంలోనూ మార్గదర్శిగా నిలిచారు’ అని చెప్పుకొచ్చాడు.