WTC FINAL : గెలిస్తే ఇండియా ఖాతాలో అదిరిపోయే రికార్డు

by Disha Web Desk 4 |
WTC FINAL : గెలిస్తే ఇండియా ఖాతాలో అదిరిపోయే రికార్డు
X

దిశ, వెబ్‌డెస్క్: వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ మ్యాచ్ ఈనెల 7 నుంచి ప్రారంభం కానుంది. టీమిండియా వరుసగా రెండోసారి డబ్ల్యూటీసీ ఫైనల్ చేరుకుంది. ఇంగ్లాండ్ లోని ఓవల్ వేదికగా జూన్ 7 నుంచి 12వ తేదీ వరకు ఆస్ట్రేలియా - ఇండియా మధ్య ఈ హై వోల్టేజీ మ్యాచ్ జరగనుంది. అయితే ఈ మ్యాచ్ లో ఆసీస్ పై ఇండియా గెలిస్తే ఓ అదిరిపోయే రికార్డు సొంతం చేసుకుంది. టీ20, వన్డే, టెస్ట్ మూడు ఫార్మాట్లలో ప్రపంచ కప్ గెలిచిన తొలి జట్టుగా రికార్డులకు ఎక్కనుంది.

సేమ్ ఇదే ఘనత ఆస్ట్రేలియాకు దక్కనుంది. ఇప్పటికే ఇండియా 1984లో కపిల్ కెప్టెన్సీలో వన్డే ప్రపంచకప్ గెలుచుకుంది. 2007లో టీ20 వరల్డ్ కప్, 2011లో వన్డే వరల్డ్ కప్ ధోనీ కెప్టెన్సీలో ఇండియా అందుకుంది. సో.. ఈ సారి టెస్ట్ వరల్డ్ కప్‌లో టీమిండియా గెలిస్తే ఈ అరుదైన ఫీట్ సొంతం చేసుకున్న తొలి జట్టు కానుంది. క్రికెట్ లవర్స్ సైతం ఈ మ్యాచ్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Next Story

Most Viewed