WPL 2025: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న గుజరాత్ జట్టు

by Mahesh |   ( Updated:2025-02-16 14:21:38.0  )
WPL 2025: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న గుజరాత్ జట్టు
X

దిశ, వెబ్ డెస్క్: ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (Women's Premier League) 2025 నాలుగో సీజన్ (fourth season) ఈ నెల 14న ప్రారంభం అయింది. ఇందులో భాగంగా మూడో మ్యాచ్ (The fourth season) వడోదర వేదికగా గుజరాత్ (Gujarat) ఉమెన్స్ జట్టు, యూపీ వారియర్స్ (UP Warriors) ఉమెన్స్ జట్టు మధ్య మ్యాచ్ ప్రారంభం అయింది. ఇందులో టాస్ గెలిచిన గుజరాత్ (Gujarat won the toss)జట్టు బౌలింగ్ ఎంచుకోవడంతో.. యూపీ జట్టు మొదట బ్యాటింగ్ చేయనుంది. ఇదిలా ఉంటే మొదటి మ్యాచులో చివరి ఓవర్లో ఓటమి చెందిన గుజరాత్ జట్టు ఈ మ్యాచులో ఎలాగైన గెలవాలని తపనతో ఉంది. అలాగే తమ మొదటి మ్యాచ్ లో విజయం సాధించి పాయింట్ల పట్టికలో ఖాతా తెరవాలని యూపీ జట్టు వేచి చూస్తుంది. ఈ క్రమంలో ఇరు జట్ల మధ్య మ్యాచ్ రసవత్తరంగా కొనసాగనుంది. అయితే ఈ మ్యాచ్ లో ఏ జట్టు పైచేయి సాధిస్తుందో తెలియాలంటే వేచి చూడాల్సిందే మరి.

యుపి వారియర్జ్ ప్లేయింగ్ XI: వృందా దినేష్, గ్రేస్ హారిస్, తహ్లియా మెక్‌గ్రాత్, కిరణ్ నవ్‌గిరే, ఉమా చెత్రీ(w), దీప్తి శర్మ(c), సోఫీ ఎక్లెస్టోన్, అలనా కింగ్, శ్వేతా సెహ్రావత్, సైమా ఠాకోర్, క్రాంతి గౌడ్

గుజరాత్ జెయింట్స్ ప్లేయింగ్ XI: బెత్ మూనీ(w), లారా వోల్వార్డ్ట్, దయాలన్ హేమలత, ఆష్లీ గార్డనర్(c), డియాండ్రా డోటిన్, సిమ్రాన్ షేక్, హర్లీన్ డియోల్, తనూజా కన్వర్, సయాలీ సత్‌ఘరే, ప్రియా మిశ్రా, కష్వీ గౌతమ్

Advertisement
Next Story