WPL 2024 : గుజరాత్‌పై బెంగళూరు సునాయాస విజయం

by Harish |
WPL 2024 : గుజరాత్‌పై బెంగళూరు సునాయాస విజయం
X

దిశ, స్పోర్ట్స్ : ఉమెన్స్ ప్రీమియల్ లీగ్ రెండో సీజన్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వరుసగా రెండో విజయం నమోదు చేసింది. తొలి మ్యాచ్‌లో యూపీ వారియర్స్‌ను చిత్తు చేసిన బెంగళూరు.. తాజాగా రెండో మ్యాచ్‌లో గుజరాత్ జెయింట్స్‌పై గెలుపొందింది. బెంగళూరు వేదికగా జరిగిన మ్యాచ్‌లో గుజరాత్‌పై 8 వికెట్ల తేడాతో నెగ్గింది. ముందుగా బ్యాటింగ్ చేసిన గుజరాత్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 107 పరుగులు చేసింది. హేమలత(31) టాప్ స్కోరర్. మోలినిక్స్ 3 వికెట్లు, రేణుక సింగ్ 2 వికెట్లతో సత్తాచాటి గుజరాత్‌ను కట్టడి చేశారు. అనంతరం 108 పరుగుల లక్ష్యాన్ని బెంగళూరు కేవలం 12.3 ఓవర్లలో 2 వికెట్ల మాత్రమే కోల్పోయి ఛేదించింది. కెప్టెన్, ఓపెనర్ స్మృతి మంధాన(43) మెరుపు ఇన్సింగ్స్‌తో చెలరేగింది. ఆమెకు తోడు తెలుగమ్మాయి సబ్బినేని మేఘన(36 నాటౌట్), ఎల్లీస్ పెర్రీ(23 నాటౌట్) రాణించడంతో బెంగళూరు సునాయాసంగా గెలుపొందింది. ఈ విజయంతో బెంగళూరు పాయింట్స్‌ టేబుల్‌లో ముంబై ఇండియన్స్‌ను వెనక్కినెట్టి అగ్రస్థానానికి చేరుకుంది.

Advertisement

Next Story