రోడ్రిగ్స్ హాఫ్ సెంచరీ.. బెంగళూరు ముందు టఫ్ టార్గెట్ పెట్టిన ఢిల్లీ

by Harish |
రోడ్రిగ్స్ హాఫ్ సెంచరీ.. బెంగళూరు ముందు టఫ్ టార్గెట్ పెట్టిన ఢిల్లీ
X

దిశ, స్పోర్ట్స్ : ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ సీజన్-2లో భాగంగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటర్లు సత్తాచాటారు. ముఖ్యంగా జెమిమా రోడ్రిగ్స్ హాఫ్ సెంచరీతో మెరిసింది. దీంతో బెంగళూరు ముందు ఢిల్లీ క్యాపిటల్స్ 182 పరుగుల టఫ్ టార్గెట్ పెట్టింది. టాస్ నెగ్గి ముందుగా బ్యాటింగ్ చేసిన ఢిల్లీ జట్టుకు ఓపెనర్లు మెగ్ లానింగ్(29), షెఫాలీ వర్మ(23) శుభారంభం అందించారు. తొలి వికెట్‌కు వీరు 54 పరుగులు జోడించారు. ఆ తర్వాత వీరిద్దరూ వరుస ఓవర్లలో అవుటయ్యారు.

అనంతరం క్రీజులోకి వచ్చిన జెమిమా రోడ్రిగ్స్(58) మరోసారి రెచ్చిపోయింది. ఆర్సీబీ బౌలర్లను పరుగులు పెట్టించిన ఆమె హాఫ్ సెంచరీతో సత్తాచాటింది. రోడ్రిగ్స్‌కుతోడు ఎలీస్ క్యాప్సే(48) సైతం మెరిసింది. ధాటిగా ఆడిన ఆమె తృటిలో అర్ధ సెంచరీ చేజార్చుకుంది. మూడో వికెట్‌కు ఈ జోడీ 97 పరుగుల భాగస్వామ్యం జోడించింది. వరుస ఓవర్లలో వీరి దూకుడుకు శ్రేయాంక పాటిల్ బ్రేక్ వేసింది. చివరి ఓవర్‌ను అద్భుత వేసిన శ్రేయాంక ఎలీస్ క్యాప్సేతోపాటు జొనాస్సెన్(1)ను పెవిలియన్ పంపింది. మారిజన్నె కాప్(12 నాటౌట్) అజేయంగా నిలిచింది. నిర్ణీత ఓవర్లలో ఢిల్లీ జట్టు 5 వికెట్లు కోల్పోయి 181 పరుగులు చేసింది. బెంగళూరు బౌలర్లలో శ్రేయాంక పాటిల్ 4 వికెట్లతో సత్తాచాటగా.. శోభనకు ఒక వికెట్ దక్కింది.

Next Story