ఉమెన్స్ జూనియర్ హాకీ ఆసియా కప్.. భారత జట్టు వరుసగా రెండో విజయం

by Disha Web Desk 13 |
ఉమెన్స్ జూనియర్ హాకీ ఆసియా కప్.. భారత జట్టు వరుసగా రెండో విజయం
X

కాకమిగహర: జపాన్‌లో జరుగుతున్న ఉమెన్స్ జూనియర్ హాకీ ఆసియా కప్‌లో భారత జట్టు వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. పూల్ -ఏలో సోమవారం మలేషియాతో జరిగిన మ్యాచ్‌లో 2-1 తేడాతో భారత్ గెలుపొందింది. ముంతాజ్, దీపిక చెరో గోల్స్‌తో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. అయితే, మ్యాచ్‌లో ప్రారంభ గోల్ మాత్రం మలేషియాదే. 6వ నిమిషంలో డయాన్ నజెరి ఆ జట్టు ఖాతా తెరిచాడు. కానీ, కాసేపటికే భారత్ తరఫున ముంజాత్ ఖాన్ గోల్ చేసి స్కోరును సమం చేసింది. 10వ నిమిషంలో దక్కిన పెనాల్టీ కార్నర్‌గా గోల్‌గా మలిచింది.

అనంతరం సెకండ్ క్వార్టర్‌లో దీపక్ 26వ నిమిషంలో మరో గోల్ చేయడంతో ఫస్టాఫ్ ముగిసే సరికి భారత్ 2-1తో లీడ్‌లో నిలిచింది. ఆ తర్వాత భారత్ బంతిని పూర్తిగా నియంత్రణలో ఉంచుకుంది. గోల్స్ చేయడంలో విఫలమైనా.. మలేషియాకు మాత్రం అవకాశాలు లేకుండా చేసి చివరి వరకూ ఆధిక్యాన్ని కాపాడుకుంది. నేడు సౌత్ కొరియాతో మూడో పూల్ మ్యాచ్ జరగనుండగా.. గెలిస్తే భారత్ సెమీస్‌కు అర్హత సాధించే అవకాశం ఉంది.



Next Story

Most Viewed