హార్థిక్ పాండ్యాపై ఆకాష్ చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు

by Dishafeatures2 |
హార్థిక్ పాండ్యాపై ఆకాష్ చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: టీమిండియా ఎట్టి పరిస్థితుల్లో పాండ్యాను రీప్లేస్ చేయలేదని ఇండియా మాజీ బ్యాట్స్‌మన్ ఆకాష్ చోప్రా అన్నాడు. ఐపీఎల్ 2022 నుంచి క్రికెట్‌లో మెరిసిన టీమిండియా ఆటగాడు హార్థిక్ పాండ్యా. సీనియర్లు, విమర్శకులు కూడా పాండ్యాను కొనియాడారు. అయితే ఆసియా కప్ 2022 దగ్గర్లో ఉన్న సందర్భంగా టీమిండియాలో పాండ్యా స్థానం సురక్షితమేనా అన్న సందేహాలు వస్తున్నాయి. వీటిపై స్పందిస్తూనే ఆకాష్ చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టీమిండియా రీప్లేస్ చేయలేని ఏకైక ప్లేయర్ పాండ్యా అంటూ ఆకాష్ చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా పాండ్యా జట్టు అవసరాలను బట్టి అన్నీ బ్యాలెన్స్ చేస్తాడని, ఆల్‌రౌండర్‌గా బ్యాట్, బాల్‌తో పాండ్యా అద్భుతంగా రాణించగలడని ఆకాష్ అన్నాడు.

'పాండ్యా అద్భుతంగా ఆడుతున్నాడు. టీమిండియా అన్నింటిలో సరిగ్గా రాణిస్తోంది. అయితే ఇక్కడ టీం యాజమాన్యం పాండ్యా విషయంలో జాగ్రత్త వహించాలి. ఎందుకంటే అతడే జట్టులో ఆ బ్యాలెన్స్ ఉంచుతున్నాడు. కాబట్టి పాండ్యాకు గాయాలు కాకుండా జాగ్రత్త వహించాలి. అతడు లేకపోతే మనం వేసుకున్న అన్ని ప్రణాళికలు పనికిరాకుండా పోతాయి. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, బుమ్రాలను మనం కావాలంటే రీప్లేస్ చేసుకోవచ్చు. కానీ బయట మరో హార్థిక్ పాండ్యా లేడు' అని ఆకాష్ చెప్పుకొచ్చాడు. మరి ఆకాష్, అభిమానుల అంచనాలకు తగ్గట్టుగా ఆసియా టీ20 వరల్డ్ కప్‌లో పాండ్యా తన ఆటత మ్యాజిక్ చేస్తాడో లేదో చూడాలి.

ఇండియాతో ఆసియా కప్ మ్యాచ్ అలాగే ఉంటుంది: బాబర్ అజాం


Next Story

Most Viewed