ప్రపంచ కప్ లో పాక్ ఆడుతుందా? లేదా ?

by Disha Web Desk 15 |
ప్రపంచ కప్ లో పాక్ ఆడుతుందా? లేదా ?
X

దిశ, వెబ్​డెస్క్​ : అసలే భారత్ ఆతిథ్యం.. ఆపై ఒకరంటే ఒకరికి పడని నైజం. తామూ వ్యతిరేక భావం ప్రదర్శిస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన.. కానీ.. అలా చేస్తే ఏమవుతుందోననే భయం.. ఇదీ ప్రస్తుతం పాకిస్థాన్ పరిస్థితి. ఎందుకంటే సెప్టెంబరులో ఆసియా కప్ టోర్నీ ఉంది. ఆతిథ్యం ఇవ్వాల్సింది పాకిస్థాన్. కానీ భారత్ మాత్రం భద్రతా కారణాల రీత్యా ప్రభుత్వ అనుమతి కష్టం కాబట్టి అక్కడ ఆడేందుకు ససేమిరా అంటోంది. ఆసియా కప్ ను తటస్థ వేదిక (యూఏఈ, శ్రీలంక, బంగ్లాదేశ్) ఇలా ఎక్కడైనా నిర్వహించవచ్చంటూ కథనాలు వస్తున్నయి.

కానీ అవేవీ ఇంతవరకు తేలలేదు. మరోవైపు ఇంతలోనే వన్డే ప్రపంచ కప్ షెడ్యూల్ విడుదలైంది. ఇక్కడే మరో సమస్య వచ్చి పడింది. ప్రపంచ కప్ మ్యాచ్ లు ధర్మశాల, ఢిల్లీ, లఖ్నో, పూణె, ముంబయి, అహ్మదాబాద్, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై కోల్​కత్తా లో జరగనున్నాయి. హైదరాబాద్ మూడు మ్యాచ్​లకు ఆతిథ్యం ఇవ్వనుంది. అయితే పాకిస్థాన్ ఆడనున్న రెండు వేదికలు (చెన్నై, బెంగుళూరు) తమకు అనుకూలంగా లేవంటూ ఇప్పటికే అభ్యంతరం వ్యక్తం చేయగా అంతర్జాతీయ క్రికెట్ కమిటీ (ఐసీసీ) ఇప్పటి వరకు దానిని పట్టించుకోలేదు. దీంతో పాకిస్థాన్ కు మండుతుంది. పిచ్ లు తమ జట్టుకు అనుకూలంగా లేవని పేర్కొంటుంది.

అసలు వస్తుందా? రాదా?

పాకిస్థాన్ వేదికగా జరిగే ఆసియా కప్ లో ఆడబోమంటూ భారత్ తేల్చిచెప్పడం పాకిస్థాన్ కు ఆగ్రహం తెప్పిస్తోంది. అంతేగాక.. టోర్నీనే తమ దేశం నుంచి తరలిపోతుండడం మరింత ఆగ్రహానికి కారణమవుతోంది. దీనికితోడు ఆదాయం లేకుండా గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్న వేళ భారత్ ఇచ్చిన షాక్ పాకిస్థాన్ బోర్డును జీర్ణించుకోలేకపోతోంది. ఈ నేపథ్యంలో భారత్ లో జరిగే ప్రపంచ కప్ ను బహిష్కరిస్తుందా? అనే అనుమానాలు వస్తున్నాయి. కానీ ఆర్థికంగా అంతంతమాత్రం ఉన్న నేపథ్యంలో ఆ పనిచేసి ఐసీసీ ఆగ్రహానికి గురయ్యే ధైర్యం చేస్తుందా అని వేచి చూడాలి.

Read More..

ODI World Cup 2023: 'అప్పుడు సచిన్ కోసం గెలిచాం.. ఇప్పుడు అతడి కోసం గెలవాలి'



Next Story

Most Viewed