వెస్టిండీస్ బోర్డుకు బిగ్ షాక్.. క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన వికెట్ కీప‌ర్

by Disha Web Desk 13 |
వెస్టిండీస్ బోర్డుకు బిగ్ షాక్.. క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన వికెట్ కీప‌ర్
X

దిశ, వెబ్‌డెస్క్: వెస్టిండీస్ వికెట్ కీప‌ర్ షేన్‌ డౌరిచ్ విండీస్ క్రికెట్ బోర్డుకు బిగ్ షాకిచ్చాడు. ఇంగ్లండ్‌తో వ‌న్డే సిరీస్‌కు ఎంపికైన డౌరిచ్ శుక్రవారం అంత‌ర్జాతీయ‌ క్రికెట్‌కు వీడ్కోలు ప‌లికాడు. 2020 డిసెంబ‌ర్‌లో చివ‌రిసారి దేశానికి ప్రాతినిధ్యం వ‌హించిన డౌరిచ్ త‌న‌ ఎనిమిదేండ్ల కెరీర్‌కు గుడ్ బై చెప్పేశాడు. డౌరిచ్ 2015లో టెస్టుల్లో అరంగేట్రం చేయగా.. ఆస్ట్రేలియాపై తొలి మ్యాచ్ ఆడాడు. డౌరిచ్ దేశం త‌ర‌ఫున ఒకే ఒక వ‌న్డే ఆడాడు. 2019లో బంగ్లాదేశ్‌పై ఏకైక వ‌న్డేలో వెస్టిండీస్ జెర్సీ వేసుకున్నాడు. అత‌డి స్థానంలో విండీస్ సెలెక్టర్లు మ‌రొక‌రిని ఎంపిక చేయ‌నున్నారు.Next Story

Most Viewed