విండీస్ వైట్‌‌బాల్ కెప్టెన్‌ను ప్రకటించిన వెస్టిండీస్ క్రికెట్ బోర్డు

by Disha Web Desk 13 |
విండీస్ వైట్‌‌బాల్ కెప్టెన్‌ను ప్రకటించిన వెస్టిండీస్ క్రికెట్ బోర్డు
X

న్యూఢిల్లీ: టీ20 వరల్డ్ కప్‌-2022లో వెస్టిండీస్ ఘోర వైఫల్యానికి బాధ్యత వహిస్తూ నికోలస్ పూరన్ కెప్టెన్‌గా తప్పుకున్న విషయం తెలిసిందే. మరోవైపు, మార్చిలో విండీస్ జట్టు రెండు టెస్టులు, మూడు వన్డేలు, మూడు టీ20ల కోసం సౌతాఫ్రికాలో పర్యటించనుంది. ఈ నేపథ్యంలో వెస్టిండీస్ క్రికెట్ బోర్డు నికోలస్ పూరన్ స్థానంలో వన్డే, టీ20 జట్లకు వేర్వేరు కెప్టెన్లను ప్రకటించింది. వన్డే జట్టు కెప్టెన్‌గా షాయ్ హోప్‌ను నియమించగా.. టీ20 పగ్గాలను రోవ్‌మన్ పావెల్‌కు అప్పగించింది. వీరిద్దరూ గతంలో పూరన్ నాయకత్వంలో వైస్ కెప్టెన్లుగా వ్యవహరించారు.

సౌతాఫ్రికా పర్యటనలో షాయ్ హోప్, రోవ్‌మన్ పావెల్ బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ ఏడాది భారత్‌లో జరిగే వన్డే వరల్డ్ కప్‌కు విండీస్ జట్టు అర్హత సాధించడం షాయ్ హోప్ ముందున్న కఠిన పరీక్ష. జూన్-జూలైలో జరిగే గ్లోబర్ క్వాలిఫయర్‌లో జింబాబ్వేపై గెలవడం ద్వారా వెస్టిండీస్ ప్రపంచకప్‌కు అర్హత సాధించనుంది. అలాగే, వచ్చే ఏడాది అమెరికాతో కలిసి సంయుక్తంగా స్వదేశంలో నిర్వహిస్తున్న టీ20 వరల్డ్ కప్‌కు జట్టును సిద్ధం చేసే బాధ్యత రోవ్‌మన్ పావెల్‌పై ఉన్నది.

Also Read...

ఫ్యాన్స్‌కు క్షమాప‌ణ‌లు చెప్పిన ఐసీసీ.. ఎందుకో తెలుసా..?



Next Story

Most Viewed