ఇండియాతో ఆసియా కప్ మ్యాచ్ అలాగే ఉంటుంది: బాబర్ అజాం

by Dishafeatures2 |
ఇండియాతో ఆసియా కప్ మ్యాచ్ అలాగే ఉంటుంది: బాబర్ అజాం
X

దిశ, వెబ్‌డెస్క్: ఆసియా టీ20 కప్ టోర్నీలో ఎలాగైనా కప్పు సాధించాలని అన్నీ దేశాల టీంలు కసరత్తులు చేస్తున్నాయి. అయితే ఈ టోర్నీలో ఇండియా, పాక్ మధ్య జరిగే మ్యాచ్‌లు ఏ రేంజ్‌లో ఉంటాయో అని ఇరు దేశాల క్రికెట్ ప్రేమికులు ఊహాగానాలు చేస్తున్నారు. అందుకు కారణం.. రెండు టీంల ఆటగాళ్లు రికార్డులు మీద రికార్డులు క్రియేట్ చేస్తున్నారు. పాక్ కెప్టెన్, బ్యాటర్ బాబర్ అజాం మైదానంలో అడుగు పెడితే పరుగుల వరద పారిస్తున్నాడు. అదే విధంగా ఇండియా బౌలర్లు క్రీజ్‌లో ఎలాంటి బ్యాట్స్‌మన్ ఉన్నా వారికి ముచ్చెమటలు పట్టిస్తున్నారు.

ఈ క్రమంలో ఈ రెండు జట్ల మ్యాచ్‌ అంటే ఊహకందని ఉత్కంఠతతో ఉంటుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. అయితే తాజాగా ఇదే విషయంపై పాక్ కెప్టెన్ బాబర్ అజాం స్పందించాడు. ఆసియా కప్‌ 2022లో టీమిండియాతో తాము తలపడే మొదటి మ్యాచ్ ప్రతి సాధారణ మ్యాచ్‌లాగానే తీసుకుంటామని బాబర్ చెప్పుకొచ్చాడు. 'ఆసియా కప్ 2022లో పాక్ టీం తమ ఆటతీరు, సామర్థ్యాలపై దృష్టి పెట్టి ఆడుతుంది. ఇండియాతో జరిగే తొలిమ్యాచ్‌ను ప్రతి మ్యాచ్‌ మాదిరిగానే పరిగణిస్తాం.ప్రతి మ్యాచ్‌లో మా మొత్తం సామర్థ్యాలను పెట్టి ఆడతాం. ఫలితాలు మాత్రం మేము చెప్పలేం' అని బాబర్ చెప్పుకొచ్చాడు.

దీంతో బాబర్ వ్యాఖ్యలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. కొందరు టీమిండియా రోజురోజుకూ బలం పుంజుకుంటుందని, టీమిండియాతో జరిగే మ్యాచ్ విషయంలో పాక్ కాస్త జాగ్రత్ పడితే మంచిదని కొందరు హితవు పలుకుతున్నారు. మరి టీ20 ఆసియా కప్ 2022 టోర్న్‌మెంట్‌లో పాక్, ఇండియా మధ్య జరిగే మ్యాచ్ ప్రేక్షకులకు కనులవిందు చేస్తుందో లేదో చూడాలి.


Next Story

Most Viewed