టీమిండియా తాత్కాలిక హెడ్ కోచ్‌గా లక్ష్మణ్.. ద్రవిడ్ అందుకే బ్రేక్..

by Dishafeatures2 |
టీమిండియా తాత్కాలిక హెడ్ కోచ్‌గా లక్ష్మణ్.. ద్రవిడ్ అందుకే బ్రేక్..
X

దిశ, వెబ్‌డస్క్: టీమిండియా వరుస వన్డే, టీ20 సిరీస్‌లతో దూసుకుపోతోంది. ఒకదాని తర్వాత ఒకటిగా వేరువేరు దేశాలతో తలపడుతూ టీ20 ప్రపంచ కప్ లక్ష్యంగా సిద్ధమవుతోంది. ఈ క్రమంలోనే టీమిండియా మరికొన్ని రోజుల్లో జింబాబ్వే జట్టుతో తలపడనుంది. ఈ రెండు జట్లు 5 వన్డే మ్యాచ్‌ల సిరీస్ ఆడనున్నాయి. అయితే తాజాగా ఈ సిరీస్ ఆడనున్న టీమిండియా తాత్కాలిక హెడ్ కోచ్‌గా మాజీ స్టార్ ప్లేయర్ వీవీఎస్ లక్ష్మణ్ ఎన్నికయ్యాడు. ఈ మేరకు సమాచారాన్ని బీసీసీఐ సెక్రటరీ జైషా తెలిపారు. 'అవును.. టీమిండియా తాత్కాలిక హెడ్‌కోచ్‌గా వీవీఎస్ లక్ష్మణ్ బాధ్యతలు నిర్వర్తించనున్నాడు. అలాగని ద్రవిడ్ బ్రేక్ తీసుకోవట్లేదు' అని జేషా తెలిపారు. అంతేకాకుండా ఆసియా కప్, జింబాబ్వే సిరీస్‌ల మధ్య కాస్త గ్యాప్ ఉందని అందుకే ఈ సిరీస్‌లో టీమిండియాకు హెడ్‌కోచ్‌గా ద్రవిడ్ లేడని తెలిపారు.

ఆసియా కప్ టైటిల్ విజేత ఆ జట్టే.. జోస్యం చెప్పిన రికీ పాంటింగ్

Next Story

Most Viewed