నన్ను ఓపెనర్‌గా పంపాలనే ఐడియా అతడిదే: సెహ్వాగ్

by Dishanational4 |
నన్ను ఓపెనర్‌గా పంపాలనే ఐడియా అతడిదే: సెహ్వాగ్
X

న్యూఢిల్లీ: టీమ్ ఇండియా జట్టులో తనను ఓపెనర్‌గా పంపాలనే ఐడియా జహీర్ ఖాన్‌దని మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ అన్నారు. ఆసియా కప్-2022 ప్రారంభం కానున్న నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్, పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్‌‌తో కలిసి స్టార్ స్పోర్ట్స్ ఓ స్పెషల్ ప్రోగ్రామ్ నిర్వహించింది. ఈ సందర్భంగా షోయబ్ అక్తర్‌కు వీరేంద్ర సెహ్వాగ్‌కు మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. షోయబ్ అక్తర్.. 'నిన్ను బ్యాటింగ్‌లో ఓపెనర్‌గా పంపాలనేది ఎవరి ఐడియా?' అని సెహ్వాగ్‌ను ప్రశ్నించాడు. దానికి సెహ్వాగ్..'నన్ను ఓపెనర్‌గా పంపాలనే ఐడియా జహీర్ ఖాన్‌ది. నా బ్యాటింగ్ స్టైల్ చూసిన జహీర్ ఖాన్ ఓపెనర్‌గా సెట్ అవుతాడని సౌరవ్ గంగూలీకి సలహా ఇచ్చాడు. గంగూలీ కూడా అతడి మాటకు విలువిచ్చి నన్ను ఓపెనర్‌గా పంపించాడు. అంతకు ముందు నేను మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్‌ని. 1999లో నిన్ను(షోయబ్ అక్తర్) ఫేస్ చేసినప్పుడు నేను మిడిల్ ఆర్డర్ బ్యాటర్‌నే.' అని సమాధానమిచ్చాడు.


Next Story

Most Viewed