ఐసీసీ మోస్ట్ వాల్యుబుల్ టీ20 జట్టులో భారత్ నుంచి ఆ ఇద్దరు బ్యాటర్లు

by Disha Web Desk 21 |
ఐసీసీ మోస్ట్ వాల్యుబుల్ టీ20 జట్టులో భారత్ నుంచి ఆ ఇద్దరు బ్యాటర్లు
X

దుబాయ్: టీ20 వరల్డ్ కప్ ముగిసిన మరుసటి రోజే ఐసీసీ అత్యంత విలువైన మెన్స్ టీ20 జట్టును ప్రకటించింది. ఈ జాబితాలో భారత్ నుంచి ఇద్దరు బ్యాటర్లు చోటు దక్కించుకున్నారు. 12వ ఆటగాడిగా భారత ఆల్ రౌండర్ హర్థిక్ పాండ్యా ఉన్నాడు. జట్టు కెప్టెన్, వికెట్ కీపర్‌‌గా ఇంగ్లాండ్ సారధి జాస్ బట్లర్ ఉన్నాడు. ప్రపంచకప్‌లో 98.66 సగటుతో 296 పరుగుల చేసిన కోహ్లి, టోర్నిలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఇక సూర్యకుమార్ యాదవ్ 59.75 సగటుతో 239 పరుగులు చేసి మూడో స్థానంలో నిలిచారు.

ఐసీసీ జట్టులో చోటు దక్కించుకున్న బౌలర్లలో సామ్ కరన్ 13 వికెట్లతో సత్తా చాటి మ్యాన్ ఆఫ్ ది టోర్నిగా నిలిచాడు. మొత్తంగా ఆరు దేశాల నుంచి ఆటగాళ్లు జట్టులో చోటు దక్కించుకున్నారు. అత్యధికంగా ఇంగ్లాండ్ జట్టు నుంచి నలుగురు ప్లేయర్లు, భారత్, పాకిస్తాన్‌ల నుంచి ఇద్దరు, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, జింబాబ్వే నుంచి ఒక్కరేసి చోటు దక్కించుకున్నారు. ఆశ్చర్యకరంగా శ్రీలంక, ఆస్ట్రేలియా నుంచి ఏ ఒక్కరూ కూడా జాబితాలో లేకపోవడం గమనార్హం. అయితే భారత్ నుంచి బౌలర్లలో ఏ ఒక్కరు కూడా ఐసీసీ జట్టులో చోటు దక్కించుకోలేదు.

జట్టు: అలెక్ హేల్స్(ఇంగ్లాండ్), జాస్ బట్లర్(కెప్టెన్/కీపర్)(ఇంగ్లాండ్), విరాట్ కోహ్లి(భారత్), సూర్యకుమార్ యాదవ్(భారత్), గ్లెన్ ఫిలిప్స్(న్యూజిలాండ్), సికిందర్ రాజా(జింబాబ్వే), షాదబ్ ఖాన్(పాకిస్తాన్), సామ్ కరన్(ఇంగ్లాండ్), నోర్టజే(దక్షిణాఫ్రికా), మార్క్ వుడ్(ఇంగ్లాండ్), షాహిన్ ఆఫ్రిది(పాకిస్తాన్), హర్థిక్ పాండ్యా(భారత్ 12వ ఆటగాడు)


Next Story

Most Viewed