కోహ్లీ ఖాతాలో చెత్త రికార్డు.. సెంచరీ చేయక ఎన్ని రోజులంటే..?

by Dishanational4 |
కోహ్లీ ఖాతాలో చెత్త రికార్డు.. సెంచరీ చేయక ఎన్ని రోజులంటే..?
X

దిశ, వెబ్‌డెస్క్: టీమిండీయా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఓ చెత్త రికార్డ్‌ను ఖాతాలో వేసుకున్నాడు. తన అద్భుత ప్రదర్శనతో ఇప్పటికే ఎన్నో రికార్డులను, బిరుదులను సొంతం చేసుకున్న కోహ్లీ.. ఇటీవల ఫామ్ లేమితో పరుగుల చేయడానికి నానా తంటాలు పడుతున్నాడు. క్రీజ్‌లో పరుగుల వరద పారించే కోహ్లీ.. దాదాపు మూడేళ్లుగా ఏ ఫార్మాట్లలోను సెంచరీ మార్క్ సాధించకపోవడం గమనార్హం. ఇప్పటి వరకు అంతర్జాతీయ క్రికెట్‌లో 70 సెంచరీలు చేసిన కోహ్లీ.. 71వ సెంచరీ కోసం దాదాపు మూడేళ్లుగా ఎదురుచూస్తున్నాడు. కోహ్లీ చివరగా నవంబర్ 22, 2019న బంగ్లాదేశ్‌పై అంతర్జాతీయ క్రికెట్‌లో సెంచరీ చేశాడు.

దీంతో విరాట్ అంతర్జాతీయ క్రికెట్‌లో చేయక నేటితో 1000 రోజులు పూర్తైంది. కోహ్లీ ఇటీవల ఐపీఎల్, ఇతర మ్యాచ్‌లలో పేలవమైన ప్రదర్శనతో ప్రేక్షకులను పూర్తిగా నిరాశ పరుస్తున్నాడు. కాగా, విరాట్ కోహ్లి 102 టెస్టుల్లో 27 సెంచరీలు, 262 వన్డే మ్యాచ్‌లు ఆడి 43 సెంచరీలు సాధించాడు. ఇక ఇండియా తరపున చివరగా ఇంగ్లండ్ టూర్‌లో ఆడిన కోహ్లీ.. విశ్రాంతి అనంతరం ఆసియా కప్‌లో బరిలోకి దిగుతున్నాడు.


Next Story

Most Viewed