త్వరలోనే టైమ్ వస్తుంది.. టెస్ట్ ఎంట్రీపై Suryakumar Yadav ఆసక్తికర వ్యాఖ్యలు

by Satheesh |
త్వరలోనే టైమ్ వస్తుంది.. టెస్ట్ ఎంట్రీపై Suryakumar Yadav ఆసక్తికర వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: సూర్య కుమార్ యాదవ్.. ప్రస్తుతం ప్రపంచ క్రికెట్‌లో ఈ పేరు ఓ ట్రెండ్. క్రీజ్‌లో ఉంటే ప్రత్యర్థి బౌలర్లను వణికించే సూర్య.. గ్రౌండ్‌ నలువైపులా షాట్లు కొడుతూ నయా మిస్టర్ 360గా పేరుగాంచాడు. తన డేంజరస్ బ్యాటింగ్‌తో అనతి కాలంలోనే టీమిండియాలో కీలక ప్లేయర్‌గా ఎదిగిన స్కై.. ఒంటి చేత్తో భారత్‌కు విజయాలు అందిస్తు్న్నాడు. ఇటీవల ముగిసిన టీ20 ప్రపంచ కప్‌లో భారత్ సెమీస్ చేరడంలో ప్రధాన పాత్ర పోషించాడు. అయినప్పటికీ దురదృష్టం కొద్ది భారత్ సెమీస్‌లోనే ఇంటి బాటపట్టింది. ఇక, న్యూజిలాండ్ వేదికగా జరుగుతోన్న టీ20 సిరీస్‌లో సూర్య కుమార్ యాదవ్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నాడు.

ఆడేది న్యూజిలాండ్‌లోనే అయినా.. సొంత దేశంలోనే ప్రత్యర్థి బౌలర్లకు చెమటలు పట్టిస్తున్నాడు. ఇటీవల జరిగిన రెండవ టీ20లో సూర్య మరోసారి రెచ్చిపోయాడు. కేవలం 51 బంతుల్లోనే 111 పరుగులు చేసి.. భారత్‌కు అద్భుత విజయాన్ని అందించిన విషయం తెలిసిందే. అయితే, టీ20, వన్డేల్లో అదరగొడుతోన్న ఈ స్టార్ బ్యాటర్.. టెస్ట్ అరంగ్రేటంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టెస్ట్ అరంగ్రేటంపై ఓ జర్నలిస్ట్ ప్రశ్నించగా.. త్వరలోనే టెస్ట్ ఫార్మాట్ నుండి పిలుపు వస్తుందని ఆశిస్తున్నట్లు చెప్పాడు. అన్నింటికి ఓ సమయం ఉంటుందని.. సరైన టైమ్‌లో అన్ని వస్తాయని సూర్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 77 మ్యాచుల్లో ఆడిన తనకు.. టెస్ట్ క్రికెట్ గురించి సరైన ఆలోచన ఉందని పేర్కొన్నాడు.

Next Story

Most Viewed