ఇండియాకు వేరే ఆప్షన్ లేదు.. వాళ్లతోనే ఆడాలి: జాఫర్

by Dishafeatures2 |
ఇండియాకు వేరే ఆప్షన్ లేదు.. వాళ్లతోనే ఆడాలి: జాఫర్
X

దిశ, వెబ్‌డెస్క్: వరల్డ్ కప్ దగ్గరవుతుండగా ప్రతి టీం తమ బెస్ట్ ప్లేయర్స్‌తో సూపర్ టీంను రెడీ చేసేందుకు చూస్తోంది. ఈ నేపథ్యంలో భారత మాజీ ప్లేయర్ వసీం జాఫర్ ఇండియా జట్టుపై కీలక వ్యాఖ్యలు చేశాడు. టీమిండియాకు ఇంకో చాయిస్ లేదంటూ ఆయన అన్నాడు. టీ20 వరల్డ్ కప్‌ బరిలో దిగేముందు భారత్ ముందు అతిపెద్ద ఛాలెంజ్ ఉందని, అది డెత్ ఓవర్స్ బౌలింగ్ అని జాఫర్ చెప్పుకొచ్చాడు. కానీ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పేసర్లను కాపాడుకోవడం తప్ప భారత్‌కు వేరే ఆఫ్షన్ లేదంటూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు.

'టోర్నీకి అత్యంత చేరువకు వచ్చేశాం. మరికొన్ని రోజుల్లోనే వరల్డ్ కప్ ప్రారంభం కానుంది. ఇప్పుడు ఉన్నవారిని తొలగించి, మార్పులు చేయాలని ఎవరూ అనుకోరు. టోర్నీలో డెత్ ఓవర్లే భారత్ ముందును అతిపెద్ద సమస్య. కానీ టీమిండియాకు మరో చాయిస్ లేదు. ప్రస్తుతం ఉన్న బౌలర్లతోనే బరిలోకి దిగాలి' అని జాఫర్ చెప్పుకొచ్చాడు. అయితే ఆదివారం సౌత్ఆఫ్రికాతో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో బ్యాటర్లు తమదైన ఆటతో ప్రత్యర్థి బౌలర్లు బెంబేలెత్తించారు.

అదే ఫామ్ బౌలర్లు మ్యాచ్ ప్రారంభంలో రాణించినా ఓవర్లు గడిచిన కొద్ది బౌలర్లలో సత్తా సన్నగిల్లింది. ఈ మ్యాచ్‌లో అర్షదీప్ సింగ్ 62 పరుగులు ఇవ్వగా, హర్షల్ పటేల్ 45 పరుగులు సమర్పించారు. ఏది ఏమైనా మ్యాచ్ భారత్ గెలిచిందని అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. కానీ విశ్లేషకులు మాత్రం ఈ బౌలింగ్ లైనప్‌తో టీ20 టోర్నీలో భారత్ కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుందని అభిప్రాయపడుతున్నారు.


Next Story

Most Viewed