భారత్, అఫ్గాన్ సిరీస్‌పై సందిగ్ధం!

by Dishafeatures2 |
భారత్, అఫ్గాన్ సిరీస్‌పై సందిగ్ధం!
X

న్యూఢిల్లీ : భారత్, ఆఫ్ఘనిస్తాన్ సిరీస్‌ జరగడంపై సందిగ్ధం నెలకొంది. వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్(డబ్ల్యూటీసీ) ఫైనల్ తర్వాత ఇరు జట్ల మధ్య వన్డే, టీ20 మ్యాచ్‌ల కోసం ఇరు క్రికెట్ బోర్డులు చర్చలు జరిపాయి. అయితే, ఆ సిరీస్‌ చర్చలకే పరిమితం కానున్నట్టు తెలుస్తోంది. నిరంతర క్రికెట్ ఆడుతున్న భారత క్రికెటర్లు డబ్ల్యూటీసీ ఫైనల్ తర్వాత నెల రోజులపాటు విశ్రాంతి తీసుకుంటున్నారని సమాచారం. అలాగే, బీసీసీఐకి ప్రస్తుతం అఫీషియల్ బ్రాడ్‌కాస్టర్ లేకపోవడం కూడా ఓ కారణమని తెలుస్తోంది. ఆస్ట్రేలియా వన్డే సిరీస్‌తోనే డిస్నీ స్టార్‌తో బ్రాడ్‌కాస్టర్ ఒప్పందం ముగిసింది.

బ్రాండ్‌కాస్ట్ పార్ట్‌నర్‌ కోసం బోర్డు ఇంకా టెండర్లను ఆహ్వానించలేదు. దాంతో అఫ్గాన్‌తో సిరీస్‌పై బోర్డు ప్రస్తుతం మందడుగు వేయలేకపోతున్నది. అయితే, ఈ సిరీస్‌ సెప్టెంబర్‌లో నిర్వహించే అవకాశం ఉందని బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. అఫ్గాన్ క్రికెట్ బోర్డుతో చర్చలు జరుపుతున్నామని, వెండీస్‌తో సిరీస్ తేదీలు ఖరారైన తర్వాత దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని చెప్పారు. కాగా, జూలైలో వెండీస్‌తో మల్టీ సిరీస్‌ కోసం టీమ్ ఇండియా కరేబియన్ గడ్డపై పర్యటించనుంది.

Next Story