సూర్య బ్యాటింగ్‌లో లోపం అదే.. మాజీ లెజెండ్ కామెంట్!

by Shiva |
సూర్య బ్యాటింగ్‌లో లోపం అదే.. మాజీ లెజెండ్ కామెంట్!
X

దిశ, వెబ్ డెస్క్: టీమిండియా స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ వరుసగా వన్డేల్లో విఫలం అవుతున్నాడు. వెన్నునొప్పితో శ్రేయాస్ అయ్యర్ జట్టుకు దూరం అవడంతో సూర్యకుమార్ యాదవ్‌కు ఆసీస్‌తో వన్డే సిరీస్‌లో చోటు దక్కింది. ఈ అవకాశాన్ని సూర్యకుమార్ ఏమాత్రం సద్వినియోగం చేసుకువడం లేదు. తొలి రెండు మ్యాచుల్లో తను ఎదుర్కొన్న తొలి బంతికే గోల్డెన్ డక్‌గా పెవిలియన్ చేరాడు.

వచ్చిన అవకాశాలను చేజార్చుకుంటున్నాడంటూ నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ఈ నేపథ్యంలోనే భారత మాజీ లెజెండ్ సునీల్ గవాస్కర్ ఒక సలహా ఇచ్చాడు. సూర్య బ్యాటింగ్‌లో టెక్నికల్ సమస్యలు ఉన్నాయని సన్ని తెలిపాడు. అతను క్రీజులో నిలబడే విధానం కూడా ఓపెన్ స్టాన్స్ అని, అది టీ20 ఫార్మాట్‌కు బాగుంటుంది, కానీ మిగతా ఫార్మాట్లలో అంతగా పని చేయదని అభిప్రాయపడ్డాడు.

'సూర్యది టెక్నికల్ సమస్య. అతని స్టాన్స్ కూడా టీ20 క్రికెట్‌లో యూజ్ అవుతుంది. ఎందుకంటే.. ఆ ఫార్మాట్‌లో ఓవర్ పిచ్ అయిన ఏ డెలివరీని అయినా ఫ్లిక్ చేసి సిక్సర్ కొట్టొచ్చు. కానీ ఇక్కడ బంతి అతని కాలుకు దగ్గరలో పడితే మాత్రంఈ స్టాన్స్ వల్ల బ్యాట్ కచ్చితంగా క్రాస్‌గా కిందకు దిగాల్సి ఉంటుంది. అప్పుడు కనుక బంతి స్వింగ్ అయితే దాన్ని ఎదుర్కోవడం సూర్యకు కష్టంగా మారుతుంది' అని సన్నీ విశ్లేషించాడు. ఈ క్రమంలో అతని టెక్నికల్ సమస్యలను ఎత్తి చూపిన సునీల్ గవాస్కర్.. 'ఈ సమస్యలను అధిగమించాలంటే.. ముందు సూర్య వెళ్లి బ్యాటింగ్‌ కోచ్‌తో మాట్లాడాలి. అప్పుడే ఇది మారుతుంది' అని చెప్పుకొచ్చాడు.

Next Story

Most Viewed