టాస్ గెలిచిన టీమిండియా.. జట్టులోకి ముగ్గురు స్టార్ ప్లేయర్స్ ఎంట్రీ

by Satheesh |
టాస్ గెలిచిన టీమిండియా.. జట్టులోకి ముగ్గురు స్టార్ ప్లేయర్స్ ఎంట్రీ
X

దిశ, వెబ్‌డెస్క్: ఐదు మ్యాచుల టీ-20 సిరీస్‌లో భాగంగా జింబాబ్వే, టీమిండియా ఇవాళ మూడో మ్యాచ్‌లో తలపడేందుకు సిద్ధమయ్యాయి. జింబాబ్వేలోని హరారే స్టేడియం వేదికగా జరుగుతోన్న ఈ మ్యాచ్‌లో టీమిండియా టాస్ గెలిచింది. భారత కెప్టెన్ శుభమన్ గిల్ తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. మూడో టీ20లో జట్టులో కీలక మార్పులతో టీమిండియాలో బరిలోకి దిగుతోంది. సంజు శాంసన్, శివమ్ దూబే, యశస్వీ జైస్వాల్ జట్టులోకి వచ్చారు. ఈ సిరీస్‌లో తొలి మ్యాచులో అతిథ్య జింబాబ్వే అనుహ్య విజయం సాధించగా.. రెండో టీ20లో రివేంజ్ తీర్చుకున్న భారత్ 100 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. దీంతో సిరీస్ 1-1 సమం కాగా, ఈ మ్యాచులో అధిపత్యం ప్రదర్శించాలని టీమిండియా ఉవ్విళ్లూరుతోంది.

జట్లు:

జింబాబ్వే (ప్లేయింగ్ XI): తడివానాషే మారుమణి, వెస్లీ మాధేవెరే, బ్రియాన్ బెన్నెట్, డియోన్ మైయర్స్, సికందర్ రజా(సి), జోనాథన్ కాంప్‌బెల్, క్లైవ్ మదాండే(w), వెల్లింగ్టన్ మసకద్జా, రిచర్డ్ నగరవ, బ్లెస్సింగ్ ముజరబానీ, టెండై చతారా

భారత్ (ప్లేయింగ్ XI): యశస్వి జైస్వాల్, అభిషేక్ శర్మ, శుభమన్ గిల్(సి), రుతురాజ్ గైక్వాడ్, సంజు శాంసన్(w), శివమ్ దూబే, రింకూ సింగ్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, అవేష్ ఖాన్, ఖలీల్ అహ్మద్

Next Story

Most Viewed