ఎయిడ్స్ టెస్ట్ చేయించుకున్న టీమిండియా స్టార్ బ్యాట్స్మేన్..!

by Dishafeatures2 |
ఎయిడ్స్ టెస్ట్ చేయించుకున్న టీమిండియా స్టార్ బ్యాట్స్మేన్..!
X

దిశ, వెబ్ డెస్క్: టీమిండియా స్టార్ బ్యాట్స్మేన్ శిఖర్ ధావన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అతడు క్రీజులో ఉన్నాడంటే ప్రత్యర్థి బౌలర్లలో వణుకు పుట్టాల్సిందే. ఫార్మాట్ ఏదైనా అతడి బ్యాట్ నుంచి వచ్చే సమాధానం మాత్రమే ఒకటే. ప్రస్తుతం 37 ఏళ్లు దాటినా ఏమాత్రం డిమాండ్ తగ్గని ఈ స్టార్ లెఫ్ట్ ఆర్మ్ బ్యాటర్.. మీసం కట్టు, పచ్చబొట్టులతో యూత్ కు ఫ్యాషన్ ఐకాన్ గా మారాడు. కాగా శిఖర్ ధావన్ తన చిన్నప్పుడు జరిగిన ఓ ఘటన గురించి ఓ ప్రైవేట్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పంచుకున్నాడు.

‘‘నాకు 15 ఏళ్ల వయసున్నప్పుడు మనాలికి వెళ్లాను. అక్కడ మా పేరేంట్స్ కు తెలియకుండా నా వీపు మీద టాటూ (పచ్చబొట్టు) వేయించుకున్నాను. తిరిగొచ్చాక ఓ మూడు నెలల తర్వాత పచ్చబొట్టు విషయం నాన్నకు తెలిసింది. నాకు పచ్చబొట్టు పొడిసిన సూదితో చాలా మందికి పచ్చబొట్టు పొడిసుంటారని, ఎందుకు టాటూ వేయించుకున్నావంటూ నాన్న నన్ను కొట్టారు. అలాంటి సూదితో టాటూ వేయించుకోవడం వల్ల ఎయిడ్స్ వచ్చే ప్రమాదం ఉందని నాన్న చెప్పారు. నాన్న మాటలు విన్న నాకు భయమేసింది. అందుకే వెంటనే వెళ్లి ఎయిడ్స్ పరీక్ష చేయించుకున్నాను. అదృష్టవశాత్తు ఆ టెస్ట్ లో నెగటివ్ వచ్చింది’’ అంటూ శిఖర్ ధావన్ ఆనందం వ్యక్తం చేశాడు.

Next Story