ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్ రైట్స్ మళ్లీ ‘టాటా’కే?.. ఎంత మొత్తానికి దక్కించుకుందంటే?

by Dishanational3 |
ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్ రైట్స్ మళ్లీ ‘టాటా’కే?.. ఎంత మొత్తానికి దక్కించుకుందంటే?
X

దిశ, స్పోర్ట్స్ : ఐపీఎల్ వచ్చే ఐదు సీజన్లకు కూడా టైటిల్ స్పాన్సర్‌గా టాటా గ్రూపే కొనసాగనుంది. గత రెండు సీజన్లకు టైటిల్ స్పాన్సర్‌గా వ్యవహరించిన టాటా సంస్థ.. 2024-28 వరకు లీగ్ టైటిల్ స్పాన్సర్ రైట్స్‌ను అంటిపెట్టుకున్నట్టు తెలుస్తోంది. గతేడాది డిసెంబర్‌ 12 బీసీసీఐ ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్ రైట్స్ కోసం బిడ్‌లను ఆహ్వానించిన విషయం తెలిసిందే. జాతీయ మీడియా తెలిపిన వివరాల ప్రకారం.. 2024-28 వరకు ఐదు సీజన్లకు సంబంధించిన టైటిల్ స్పాన్సర్ రైట్స్‌ను టాటా సన్స్ ప్రైవేట్ లిమిడెట్ రూ.2,500 కోట్లకు తిరిగి సొంతం చేసుకుంది. ఒక్కో సంవత్సరానికి రూ. 500 కోట్లు చెల్లించనుంది. వివో నుంచి టాటా సన్స్ 2022లో టైటిల్ రైట్స్‌ను పొందింది. గత సర్కిల్(2018-22) 2022తోనే ముగియగా టాటా హక్కులను మరో ఏడాది పొడిగించారు. 2022, 2023 సీజన్ల కోసం టాటా సన్స్ రూ. 670 కోట్లు వెచ్చించింది. ఈ సారి ఆదిత్య బిర్లా గ్రూపు అత్యధికంగా రూ.2,500 కోట్లతో బిడ్ వేసింది. అయితే, ప్రస్తుత టైటిల్ రైట్స్ హోల్డర్‌గా రైట్ టూ మ్యాచ్(ఆర్‌టీఎం)ను ఉపయోగించిన టాటా సంస్థ అంతే మొత్తానికి తిరిగి టైటిల్ హక్కులను దక్కించుకుంది. దీనిపై బీసీసీఐ నుంచి అధికారిక స్పష్టత రావాల్సి ఉంది.

Next Story