వరల్డ్‌కప్‌లో టీమిండియా బెస్ట్ ఫినిషర్ Suryakumar Yadav: Dileep Vengsarkar

by Hajipasha |
వరల్డ్‌కప్‌లో టీమిండియా బెస్ట్ ఫినిషర్ Suryakumar Yadav:  Dileep Vengsarkar
X

దిశ, వెబ్‌డెస్క్: భారత మాజీ కెప్టెన్, చీఫ్ సెలెక్టర్ దిలీప్ వెంగ్‌సర్కార్ టీమిండియా బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆస్ట్రేలియా వేధికగా అక్టోబర్‌లో జరుగనున్న ప్రపంచకప్‌కు భారత జట్టును బీసీసీఐ సోమవారం ప్రకటించింది. కాగా ప్రపంచకప్‌ పైనే మాజీ ఆటగాళ్ల దృష్టిమల్లింది. ఈ క్రమంలోనే టీమిండియా మాజీ కెప్టెన్ సవార్కర్ స్పందించి.. టీ20 వరల్డ్ కప్ 2022 లో టీమిండియా జట్టుకు సూర్యకుమార్ యాదవ్ గొప్ప ఫినిషర్ కాగలడని అభిప్రాయపడ్డాడు. సూర్యకుమార్ యాదవ్ ఏ స్థానంలో వచ్చిన జట్టుకు రాణించగల్గుతాడని, నాల్గవ నంబర్‌లో బ్యాటింగ్‌కు వచ్చి.. ఐదు పరుగుల వద్ద కూడా బ్యాటింగ్ చేయగలడని అభిప్రాయపడ్డాడు. టీ20 ఫార్మట్ వన్డే, టేస్టుల ఉండదని, అందులో అన్ని స్థానాల్లో నిర్దిష్ట బ్యాటర్లు అవసరమని చెప్పుకొచ్చాడు. ఈ ఫార్మాట్‌లో, ఎవరైనా ఎక్కడైనా బ్యాటింగ్ చేయవచ్చని పెర్కొన్నాడు

Next Story