సన్ రైజర్స్ యూట్యూబ్ చానెల్ హ్యాక్.. ఆరు గంటల్లో 29 వీడియోలు అప్ లోడ్

by Disha Web |
సన్ రైజర్స్ యూట్యూబ్ చానెల్ హ్యాక్.. ఆరు గంటల్లో 29 వీడియోలు అప్ లోడ్
X

దిశ, వెబ్ డెస్క్: సన్‌రైజర్స్ హైదరాబాద్ యూట్యూబ్ చానెల్‌కు హ్యాక్‌కు గురైంది. శుక్రవారం సన్‌రైజర్స్ తమ న్యూ కిట్ ఆవిష్కరించింది. ఇందుకు సంబంధించిన వీడియోను యూట్యూబ్‌లో పోస్ట్ చేసింది. కానీ ఆ తర్వాత 6 గంటల వ్యవధిలోనే 29 వీడియోలు అప్‌లోడ్ అయ్యాయి. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు ఏ మాత్రం సంబంధం లేని ఈ వీడియోలను చూసి ఫ్యాన్స్ షాకయ్యారు. గేమ్స్, సాఫ్ట్‌వేర్ డౌన్‌లోడ్‌కు సంబంధించిన వీడియోలు కావడంతో యూట్యూబ్ చానెల్ హ్యాక్ అయినట్లు గుర్తించారు.

శనివారం ఉదయం హ్యాకర్స్ తొలి వీడియోను అప్‌లోడ్ చేశారు. అందులో గేమ్‌ఫర్ నైట్ డౌన్‌లోడ్ లింక్‌తో పాటు చీట్స్ అండ్ కోడ్స్ షేర్ చేశారు. ఆ తర్వాత కూడా కొరెల్‌డ్రా, కాన్వ, అడోబ్ ప్రిమియర్‌కు సంబంధించిన లింక్స్‌ను షేర్ చేశారు. అయితే సైబర్ క్రైమ్ నేరస్థులే ఈ పని చేసినట్లు ఈ వీడియోలను చూస్తే అర్థమవుతోంది. అయితే హ్యాంకింగ్ సంబంధించిన సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇప్పటి వరకు అధికారికంగా స్పందించలేదు.




Next Story