సన్ రైజర్స్‌కి కొత్త కెప్టెన్.. సరికొత్త జెర్సీతో బరిలోకి..

by Vinod kumar |
సన్ రైజర్స్‌కి కొత్త కెప్టెన్.. సరికొత్త జెర్సీతో బరిలోకి..
X

హైదరాబాద్: ఐపీఎల్-16లో సన్‌రైజర్స్ హైదరాబాద్ కొత్త కెప్టెన్, కొత్త జెర్సీతో సరికొత్తగా బరిలో నిలువనుంది. ఇటీవలే సౌతాఫ్రికా క్రికెటర్‌ ఎయిడెన్ మార్క్‌రమ్‌‌కు సారథ్య బాధ్యతలు అప్పగించిన ఎస్‌ఆర్‌హెచ్.. తాజాగా జట్టు న్యూ జెర్సీని ఆవిష్కరించింది. కొత్త జెర్సీలు ధరించిన బ్యాటర్ మయాంక్ అగర్వాల్, పేసర్ ఉమ్రాన్ మాలిక్, ఆల్‌ రౌండర్ వాషింగ్టన్ సుందర్ ఫొటోలను హైదరాబాద్ గురువారం తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేసింది. గత సీజన్‌తో పోలిస్తే జెర్సీ‌లో పెద్దగా మార్పులేం చేయలేదు.

జెర్సీ పూర్తిగా ఆరెంజ్‌ కలర్‌లో ఉండగా.. షోల్డర్‌ వద్ద బ్లాక్, ఆరెంజ్ షేడ్స్‌ ఉన్నాయి. అయితే, జెర్సీపై ఎలాంటి స్పాన్సర్ లోగోలు ముద్రించలేదు. కేవలం సన్‌రైజర్స్ హైదరాబాద్ లోగో మాత్రమే ఉన్నది. గత రెండు సీజన్లుగా దారుణమైన ప్రదర్శనతో ప్లే ఆఫ్స్‌కు కూడా చేరుకోని హైదరాబాద్.. ఈ సీజన్‌లో సత్తాచాటాలనుకుంటున్నది. లీగ్‌లో ఏప్రిల్ 2న సొంతగడ్డపై జరిగే తొలి మ్యాచ్‌లో హైదరాబాద్.. రాజస్థాన్ రాయల్స్‌ను ఢీకొట్టనుంది.Next Story

Most Viewed