కీలక మ్యాచ్‌కు ముందు సన్‌రైజర్స్‌కు బిగ్ షాక్

by Vinod kumar |
కీలక మ్యాచ్‌కు ముందు సన్‌రైజర్స్‌కు బిగ్ షాక్
X

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ 2022 సీజన్‌లో ప్లే ఆఫ్స్‌ అవకాశాలను సజీవంగా ఉంచుకున్న సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు షాక్ తగిలింది. మరో కీలకమైన మ్యాచ్‌ ఉండగా.. సన్‌రైజర్స్‌ కెప్టెన్ కేన్ విలియమ్సన్‌ స్వదేశానికి పయనమయ్యాడు. కేన్ విలియమ్సన్‌ భార్య సారా రహీం త్వరలో రెండో బిడ్డకు జన్మనివ్వాల్సి ఉండటంతో.. న్యూజిలాండ్‌కు బయలుదేరాడు. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ మే 22న లీగ్ దశలో తమ చివరి మ్యాచ్‌ను పంజాబ్ కింగ్స్‌తో ఆడనుంది. సన్‌రైజర్స్‌ హైదరాబాద్ యాజమాన్యం తన అధికారిక ట్విటర్‌ వేదికగా వెల్లడించింది. 'మా కెప్టెన్ కేన్ విలియమ్సన్ తన కుటుంబంలోకి రానున్న చిన్నారిని స్వాగతించడానికి న్యూజిలాండ్‌కు తిరిగి వెళ్తున్నాడు. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ క్యాంప్‌లోని ప్రతి ఒక్కరూ కేన్ సతీమణికి సురక్షితమైన ప్రసవం జరగాలని కోరుకుంటున్నారు' అని సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ట్వీట్ చేసింది.


Advertisement

Next Story

Most Viewed