వినోద్ కాంబ్లీకి గవాస్కర్ సాయం.. జీవితాంతం ప్రతి నెలా రూ.30 వేలు అందజేత

by Harish |
వినోద్ కాంబ్లీకి గవాస్కర్ సాయం.. జీవితాంతం ప్రతి నెలా రూ.30 వేలు అందజేత
X

దిశ, స్పోర్ట్స్ : భారత మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ మాట నిలబెట్టుకున్నాడు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న మరో మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీకి ఆపన్నహస్తం అందించాడు. గవాస్కర్‌కు చెందిన చాంప్స్ ఫౌండేషన్ కాంబ్లీకి ప్రతి నెల రూ. 30 వేలు అందజేయనుంది. 2013లో కాంబ్లీకి రెండుసారు హార్ట్ సర్జరీలు జరిగాయి. అప్పుడు క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ఆర్థికసాయం అందజేశాడు. కొంతకాలంగా కాంబ్లీ అనారోగ్య సమస్యలతో ఇబ్బందిపడుతున్నాడు.

గతేడాది డిసెంబర్‌లో యూరినరీ ఇన్‌ఫెక్షన్, ఇతర అనారోగ్య సమస్యలతో కాంబ్లీ హాస్పిటల్‌లో చేరిన విషయం తెలిసిందే. అప్పుడు 1983 వరల్డ్ కప్ విన్నింగ్ జట్టు కాంబ్లీకి అండగా ఉండాలని గవాస్కర్ కోరారు. ఇటీవల ఓ కార్యక్రమంలో గవాస్కర్, వినోద్ కాంబ్లీ కలిశారు. కాంబ్లీ తన సీనియర్ అయిన గవాస్కర్‌పై గౌరవం చాటుకున్నాడు. గవాస్కర్‌కు పాదాభివందనం చేశాడు. అదే కార్యక్రమంలో కాంబ్లీకి హెల్ప్ చేసేందుకు గవాస్కర్ ముందుకు వచ్చాడు. గవాస్కర్ స్వయంగా కాంబ్లీ వైద్యులను కలిసి అతడి ఆరోగ్య పరిస్థితిని ఆరా తీశారు. ఈ క్రమంలో గవాస్కర్ మాట నిలబెట్టుకున్నాడు. అంతర్జాతీయ క్రీడాకారులకు ఆర్థిక సాయం అందించేందుకు గవాస్కర్ 1999లో చాంప్స్ ఫౌండేషన్‌ను ప్రారంభించారు. ఆ ఫౌండేషన్ నుంచి గవాస్కర్ జీవితాంతం కాంబ్లీకి ప్రతి నెలా రూ. 30 వేలు అందించనున్నారు



Next Story

Most Viewed