'నాటు నాటు' పాటకు స్టెప్పులేసిన టీమ్ ఇండియా మాజీ క్రికెటర్.. (వీడియో)

by Disha Web Desk 13 |
నాటు నాటు పాటకు స్టెప్పులేసిన టీమ్ ఇండియా మాజీ క్రికెటర్.. (వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్: ఎస్. ఎస్. రాజమౌళి తెరకెక్కించిన 'ఆర్‌ఆర్‌ఆర్' సినిమాలోని 'నాటు నాటు' పాటకు ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డు లభించింది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో తొలిసారి భారత మూవీకి అత్యున్నత పురస్కారం దక్కింది. సంగీత దర్శకుడు ఎమ్ ఎమ్ కీరవాణితో పాటు రచయిత చంద్రబోస్ ఆస్కార్ అవార్డ్స్‌ను స్వీకరించారు. సోషల్ మీడియా వేదికగా 'నాటు నాటు' పాట హోరెత్తిపోతుంది. తెలుగు ప్రజలే కాకుండా యావత్ దేశం.. ఈ సందర్భాన్ని సెలబ్రేట్ చేసుకుంటుంది. ఈ నేపథ్యంలో టీమిండియా దిగ్గజం సునీల్ గవాస్కర్ సైతం.. ఆర్‌ఆర్‌ఆర్‌కు ఆస్కార్ వచ్చిందని తెలిసి ఆనందంతో డ్యాన్స్ చేశాడు. ఈ పాటకు కాలు కూడా కదిపాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియా‌లో వైరల్‌గా మారింది. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఇటీవలే ఆ సినిమా చూశానని, చాలా అద్భుతంగా ఉందని కితాబిచ్చాడు. భారత సినిమా అంతర్జాతీయ వేదికపై మరిన్నీ అవార్డులు గెలిచేందుకు ఇది నాంది కావాలని తెలిపాడు.

గవాస్కర్‌తో పాటు సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్, వీవీఎస్ లక్ష్మణ్, దినేశ్ కార్తీక్‌ తదితరులు సైతం ట్రిపుల్ ఆర్ టీమ్‌ను అభినందించారు. సోషల్ మీడియా వేదికగా రాజమౌళీ పై ప్రశంసల జల్లు కురిపించారు. భారత్‌కే చెందిన డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ 'ది ఎలిఫెంట్ విస్పర్స్'‌కు ఆస్కార్ రావడంపై కూడా భారత మాజీ క్రికెటర్లు హర్షం వ్యక్తం చేశారు. దేశానికి రెండు ఆస్కార్ అవార్డులు దక్కడం చాలా సంతోషంగా ఉందని ట్వీట్ చేశారు.



Next Story

Most Viewed