రెండో రౌండ్‌లో సుమిత్ నగాల్ ఓటమి

by Dishanational5 |
రెండో రౌండ్‌లో సుమిత్ నగాల్ ఓటమి
X

దిశ, స్పోర్ట్స్: మొరాకో వేదికగా జరుగుతున్న ఏటీపీ 250 ఈవెంట్ మరకేశ్ ఓపెన్‌లో భారత అగ్రశ్రేణి టెన్నిస్ ఆటగాడు సుమిత్ నగాల్ నిరాశపర్చాడు. బుధవారం జరిగిన మెన్స్ సింగిల్స్‌ రెండో రౌండ్‌లో ఇటాలియన్ ప్లేయర్ లొరెంజో సొనెగో చేతిలో 6-1, 3-6, 4-6 తేడాతో ఓటమిపాలయ్యాడు. ఆరంభంలో పూర్తి ఆధిపత్యం ప్రదర్శించి 6-1తో తొలి గేమ్‌ను గెలుచుకున్న సుమిత్.. మిగతా రెండు గేమ్‌లలో మాత్రం తేలిపోయాడు. ఇక, పురుషుల డబుల్స్‌లో భారత్‌కు చెందిన యుకీ భాంబ్రీ- అల్బానో ఒలివెట్టి(ఫ్రెంచ్)ల జోడీ డచ్-గ్రీక్ ద్వయం బార్ట్ స్టీవెన్స్- పెట్రోస్ సిట్సిపాస్‌పై 6-3, 6-4 తేడాతో విజయం సాధించి క్వార్టర్స్‌కు చేరుకుంది.
Next Story

Most Viewed