ఐపీఎల్ ప్లే ఆఫ్ కు చేరే జట్లేవో తేల్చేసిన స్టీవ్ స్మిత్

by Disha Web Desk 1 |
ఐపీఎల్ ప్లే ఆఫ్ కు చేరే జట్లేవో తేల్చేసిన స్టీవ్ స్మిత్
X

దిశ, వెబ్ డెస్క్: ఐపీఎల్ 2023 సీజన్ శుక్రవారం నుంచి అట్టహాసంగా ప్రారంభం కాబోతోంది. మార్చి 31 నుంచి మే 28 వరకు మ్యాచ్‌లు జరగనుండగా.. మే 20 వరకు టోర్నీలోని పది జట్ల మధ్య లీగ్ మ్యాచ్‌లు కొనసాగనున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్లే ఆఫ్స్‌ కి చేరే జట్లపై ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్‌స్మిత్ తేల్చేసి ఆ జట్లు ఏవో కూడా చెప్పేశాడు. ఐపీఎల్ 2023 వేలానికి రూ.2 కోట్ల కనీస ధరతో వచ్చిన స్టీవ్‌స్మిత్‌ని ఏ ఫ్రాంఛైజీ కొనుగోలు చేయలేదు. దీంతో అతను ఐపీఎల్ 2023కి కామెంటేటర్‌గా వ్యవహరించబోతున్నాడు. ఐపీఎల్ 2023 ప్లేఆఫ్స్‌కి చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్ జెయింట్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ చేరతాయని జోస్యం చెప్పాడు.

స్టీవ్‌స్మిత్ కామెంట్స్ పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ముంబయి ఇండియన్స్ అభిమానులు గుర్రుగా ఉన్నారు ముంబయి ఇండియన్స్ ఐదు సార్లు టైటిల్ విజేతగా నిలవగా.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మూడు సార్లు ఫైనల్‌కి చేరి నిరాశ పరచింది. అయితే, ఈ ఏడాది జస్‌ప్రీత్ బుమ్రా లేకపోవడంతో ముంబయి టీం కాస్త బలహీనంగా కనిపిస్తోంది. అలానే బెంగళూరు బౌలింగ్‌ విభాగం కూడా బలహీనంగానే ఉంది. ఈ కారణం వల్లే స్టీవ్‌స్మిత్ ఆ రెండు జట్లను పక్కన పెట్టినట్లు తెలుస్తోంది.

చెన్నై సూపర్ కింగ్స్‌ గత ఏడాది కనీసం ప్లేఆఫ్స్‌కి కూడా చేరలేకపోయింది. కానీ.. ఇప్పటికే నాలుగు సార్లు టైటిల్ గెలిచిన ఆ జట్టు ఈ ఏడాది మంచి బ్యాలెన్స్ తో కనిపిస్తోంది. అలానే గుజరాత్ టైటాన్స్ గత ఏడాది ఛాంపియన్‌గా నిలవగా.. లక్నో సూపర్ జెయింట్స్ కూడా అంచనాలకి మించి రాణించింది. ఇక సన్‌రైజర్స్ హైదరాబాద్ టీం గత మూడు సీజన్లుగా నిరాశపరుస్తున్నా.. ఈ సారి యంగ్, సీనియర్ ప్లేయర్లతో సమతూకంతో కనిపిస్తోంది.



Next Story

Most Viewed