అంపైర్‌పై హసరంగ విమర్శలు.. వేటు వేసిన ఐసీసీ

by Dishanational3 |
అంపైర్‌పై హసరంగ విమర్శలు.. వేటు వేసిన ఐసీసీ
X

దిశ, స్పోర్ట్స్ : శ్రీలంక టీ20 కెప్టెన్ వానింద హసరంగకు ఐసీసీ షాకిచ్చింది. ఆఫ్ఘనిస్థాన్‌తో జరిగిన మూడో టీ20లో ఐసీసీ ప్రవర్తనా నియామవళిని ఉల్లంఘించిన కారణంగా మ్యాచ్ ఫీజులో 50 శాతం కోతపెట్టడంతోపాటు మూడు డీమెరిట్ పాయింట్లు కేటాయించింది. అంతేకాకుండా, 24 నెలల్లో అతని ఖాతాలో ఐదు డీమెరిట్ పాయింట్లు చేరడంతో హసరంగపై రెండు మ్యాచ్‌ల నిషేధం విధించింది. ఆఖరి టీ20లో శ్రీలంకపై 3 పరుగుల తేడాతో ఆఫ్ఘనిస్తాన్ విజయం సాధించింది. మ్యాచ్ అనంతరం హసరంగ అంపైర్ పై విమర్శలు చేశాడు. చివరి ఓవర్‌లో నడుం కంటే ఎత్తులో వచ్చిన బంతిని అంపైర్ నో బాల్‌గా ప్రకటించలేదని, అలాంటి వారు అంతర్జాతీయ క్రికెట్‌లో అంపైరింగ్ చేయడం కంటే వేరే పని చూసుకుంటే మంచిదంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. ఐసీసీ ప్రవర్తనా నియామళి ప్రకారం..మ్యాచ్ అఫీషియల్స్‌ను విమర్శించడం ఆర్టికల్ 2.13 ఉల్లంఘన కింది వస్తుంది. ఐసీసీ వేటుతో వచ్చే నెలలో బంగ్లాదేశ్‌తో జరిగే టీ20 సిరీస్‌లో హసరంగ తొలి రెండు మ్యాచ్‌లకు దూరంకానున్నాడు. అలాగే, ఇదే మ్యాచ్‌లో లెవన్ 1 ఉల్లంఘనకు పాల్పడిన అఫ్గాన్ ఆటగాడు గుర్బాజ్‌ మ్యాచ్ ఫీజులో 15 శాతం ఐసీసీ కోత పెట్టింది. కాగా, మూడు టీ20ల సిరీస్‌ను శ్రీలంక 2-1తో సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.


Next Story