- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- ఎన్ఆర్ఐ - NRI
- సెక్స్ & సైన్స్
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- భక్తి
SRH ముందు భారీ సవాల్.. అభిషేక్ శర్మకు కనీసం 14 కోట్లు అవసరం
దిశ, వెబ్‌డెస్క్: IPL 2025కు సంబంధించిన వేలం డిసెంబర్‌లో జరగనుంది. ఈ క్రమంలో కొత్తగా వచ్చిన రిటెన్షన్ రూల్స్.. సన్ రైజర్స్ జట్టుకు తలనొప్పి తెచ్చిపెట్టాయి. 2024 ఐపీఎల్ భారీ ప్రదర్శన కనబరిచిన యువ ప్లేయర్ అభిషేక్ శర్మ కు భారీ డిమాండ్ ఏర్పడింది. ఇదిలా ఉంటే ఇటీవల బెంగళూరులో ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్(IPL Governing Council) సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఐపీఎల్ 2025-27 సర్కిల్‌కు సంబంధించి నిబంధనలు నిర్ణయించారు. ఫ్రాంఛైజీల పర్సు వాల్యూ పెంపు, అన్ క్యాప్డ్ ప్లేయర్ రూల్, ప్లేయర్లకు మ్యాచ్ ఫీజులు చెల్లించాలని నిర్ణయాలు తీసుకున్నారు. అలాగే ప్లేయర్ల రిటెన్షన్ పై కొత్త నిబంధనలు కూడా తీసుకొచ్చారు. దీని ప్రకారం.. ఇద్దరు ఆటగాళ్లను రిటెన్షన్ ప్రకారం ఒక్కొక్కరికి రూ.18 కోట్లకు, ఇద్దరిని రూ. 14 కోట్లకు, ఒకరిని INR 11 కోట్లకు ఉంచుకోవచ్చుని తెలిపింది. కాగా ఇక్కడే SRH కు భారీ సవాల్ ఎదురైంది. IPL Governing Council నిర్ణయంతో.. IPL 2024 అద్భుతమైన ప్రదర్శన కనబరిచిన అభిషేక్ శర్మ విలువ రూ. 14 కోట్లు, అంతకంటే ఎక్కువకు చేరుకుంది. దీనిపై SRH మాజీ కోచ్ టామ్ మూడీ స్పందిస్తూ.. అభిషేక్ శర్మను నిలుపుకోవడం ఫ్రాంచైజీకి సవాలుగా ఉంటుందని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అతన్ని 14 కోట్లకు రిటైన్ చేసుకుంటే ఆ జట్టు పర్సు పై తీవ్ర ప్రభావం పడుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.