IPL: కాసేపట్లో SRH మ్యాచ్‌.. ఫ్యాన్స్‌ను కంగారు పెట్టిస్తోన్న వెదర్ రిపోర్ట్

by Disha Web Desk 9 |
IPL: కాసేపట్లో SRH మ్యాచ్‌.. ఫ్యాన్స్‌ను కంగారు పెట్టిస్తోన్న వెదర్ రిపోర్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లోని ఉప్పల్ మైదానం వేదికగా ఇవాళ సన్ రైజర్స్ హైదరాబాద్, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య మ్యాచ్ ఉన్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ రాత్రి 7 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. అయితే, మ్యాచ్‌కు ముందు వాతావరణ శాఖ కీలక సూచనలు చేసింది. వర్షం అంతరాయం కలిగే అవకాశం ఉందని తెలిపింది. భారత వాతావరణ విభాగం(IMD) హైదరాబాద్ ప్రకారం నగరంలో పలుచోట్ల ఇవాళ వర్షం పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, సరిగ్గా 7:30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. మ్యాచ్ వీక్షించేందుకు ఇప్పటికే అభిమానులు భారీగా మైదానికి తరలివెళ్లారు. ఈ క్రమంలో వాతావరణ శాఖ వెదర్ రిపోర్ట్ విడుదల చేయడంతో ఫ్యాన్స్ ఆందోళనకు గురవుతున్నారు.

ఎస్ఆర్‌హెచ్: ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, మయాంక్ అగర్వాల్, నితీష్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్(WK), గ్లెన్ ఫిలిప్స్, అబ్దుల్ సమద్, షాబాజ్ అహ్మద్, పాట్ కమిన్స్, భువనేశ్వర్ కుమార్, జయదేవ్ ఉనద్కత్/ఉమ్రాన్ మాలిక్. (ఇంపాక్ట్ సబ్: టి నటరాజన్)

లక్నో: కేఎల్ రాహుల్(సి), క్వింటన్ డి కాక్, మార్కస్ స్టోయినిస్, నికోలస్ పూరన్, దీపక్ హుడా, ఆయుష్ బడోని, కృనాల్ పాండ్యా, రవి బిష్ణోయ్, మొహ్సిన్ ఖాన్, నవీన్-ఉల్-హక్, యశ్ ఠాకూర్. (ఇంపాక్ట్ ప్లేయర్ - అర్షిన్ కులకర్ణి)

Next Story