ఫిఫా వరల్డ్ కప్ : పసికూనపై చెలరేగిన స్పెయిన్.. కోస్టారికాపై విజయం

by Disha Web |
ఫిఫా వరల్డ్ కప్ : పసికూనపై చెలరేగిన స్పెయిన్.. కోస్టారికాపై విజయం
X

దిశ, వెబ్‌డెస్క్: ఫిఫా వరల్డ్ కప్ 2022లో భాగంగా స్పెయిన్, కోస్టారికా జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో పసికూన కోస్టారికాను 7-0తో స్పెయిన్ చిత్తు చేసింది. మ్యాచ్ తొలి హాఫ్‌లోనే భారీ ఆధిక్యం సాధించింది. మ్యాచ్ మొదలైన 11 నిమిషాల్లోనే స్పెయిన్ జట్టు తొలి గోల్ చేసింది. ఆ షాక్ నుంచి కోస్టారికా తేరుకునేలోపే మరో రెండు గోల్స్ చేసింది స్పెయిన్. దీంతో తొలి అర్థభాగాన్ని 3-0 ఆధిక్యంలో ముగించింది. సెకండ్ హాఫ్‌లోనూ అదే జోరు కొనసాగించింది. సెకండ్ హాఫ్‌లో మరో నాలుగు గోల్స్ పూర్తి చేశారు. దీంతో కోస్టారికాను 7-0 తో స్పెయిన్ చిత్తు చేసింది.

Next Story

Most Viewed