'దుర్గాపూజ పండల్‌'ను ప్రారంభించిన గంగూలీ

by Dishanational4 |
దుర్గాపూజ పండల్‌ను ప్రారంభించిన గంగూలీ
X

కోల్‌కతా: భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బీసీసీఐ) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ కోల్‌కతాలోని మిటాలీ సంఘ్ కమ్యూనిటీకి చెందిన దుర్గాపూజ పండల్‌ను ప్రారంభించారు. కోల్‌కతాలో దేవీ నవరాత్రి ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తారు. ఈ క్రమంలో పూజ వేడుకల్లో పాల్గొన్న గంగూలీ దుర్గామాతను దర్శించుకున్నారు. అయితే లండన్‌లోని లార్డ్స్ వేదికగా 2002లో వన్డే సిరీస్ జరిగిన విషయం గుర్తు ఉండి ఉంటుంది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌పై భారత్ గెలిచింది. అప్పుడు సౌరవ్ గంగూలీ లార్డ్స్ స్టేడియంలో బాల్కనీ వద్ద షర్ట్ విప్పి హంగామా చేశారు.

అయితే ఈ థీమ్‌తోనే పూజా కమిటీ దుర్గా పూజ పండల్‌కు పక్కన లార్ట్స్ పెవిలియన్‌ను పోలిన నిర్మాణాన్ని ఏర్పాటు చేసింది. ఈ పెవిలియన్‌ను గంగూలీ ప్రారంభించారు. కమిటీ సభ్యులతో కలిసి జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం స్పోర్ట్స్ ప్రమోటర్ సుతద్రు దుత్త మాట్లాడుతూ..'ఆ సమయం లార్డ్స్ బాల్కనీ ఇండియన్ క్రికెట్ భవిష్యత్‌ను మార్చేసింది. గంగూలీ ఆ విజయాన్ని ఎంతో ఆస్వాదించారు. ఆ సంతోషంలో తన టీ షర్టును గాల్లో తిప్పారు.' అని తెలిపారు. కాగా, సౌరవ్ గంగూలీ దుర్గా పూజ వేడుకల్లో పాల్గొనడంతో భక్తులు, అభిమానుల రద్దీ పెరిగింది.


Next Story

Most Viewed