ఆ ఫార్మాట్‌లోనే ఐపీఎల్: గంగూలీ

by Disha Web Desk 21 |
ఆ ఫార్మాట్‌లోనే ఐపీఎల్: గంగూలీ
X

న్యూఢిల్లీ: 'సొంత మైదానం-బయట మైదానం' ఫార్మాట్‌లోనే ఐపీఎల్-2023 వచ్చే సీజన్‌ను నిర్వహిస్తామని భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బీసీసీఐ) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ తెలిపాడు. గురువారం భారత టీ20 లీగ్‌కు సంబంధించి రాష్ట్రాల క్రికెట్ సంఘాలకు కీలక ప్రకటన చేశాడు. ఈ సందర్భంగా సౌరవ్ గంగూలీ మాట్లాడుతూ.. 'పురుషుల భారత టీ20 లీగ్‌ను 'సొంత మైదానం-బయట మైదానం' తరహాలో వచ్చే సీజన్ నిర్వహిస్తాం. కరోనా కారణంగా గత సీజన్‌ కేవలం నాలుగు మైదానాలకే పరిమతమైంది. ఢిల్లీ, అహ్మదాబాద్, ముంబై, చెన్నయ్ వేదికగా ఐపీఎల్ కొనసాగింది. తదుపరి సీజన్ మొత్తం పది జట్లు వారిగా స్వదేశీ మ్యాచులు నిర్ణీత వేదికలలో నిర్వహించనున్నాం. 2020 తర్వాత మొదటిసారిగా బీసీసీఐ పూర్తి స్థాయి దేశీయ సీజన్‌ను నిర్వహిస్తోంది.

అలాగే ఉమెన్స్ టీ20 లీగ్‌పైనా బీసీసీఐ కసరత్తు చేస్తోంది. వచ్చే ఏడాది ఆరంభంలో మొదటి సీజన్ ప్రారంభించాలని భావిస్తున్నాం. మహిళల ఐపీఎల్‌తోపాటు బాలికల అండర్-15 వన్డే టోర్నమెంట్ కూడా ప్రారంభించనున్నాం. యూ-15 వన్డే టోర్నమెంట్ ప్రవేశపెట్టడం చాలా సంతోషంగా ఉంది. ఈ కొత్త టోర్నీతో యువ క్రికెటర్లు అంతర్జాతీయ స్థాయిలో చోటు దక్కే అవకాశం ఉంది.' అని పేర్కొన్నారు. కాగా, ఈ ఏడాది డిసెంబర్ 26 నుంచి 2023 జనవరి 12వ తేదీ వరకు బాలికల అండర్-15 టోర్నమెంట్ ప్రారంభం కానుంది. బెంగళూర్, రాంచీ, రాజ్‌కోట్, ఇండోర్, రాయ్‌పూర్, పూణె వేదికగా మ్యాచులు జరగనున్నారు.

నా చేతుల్లో లేదు..

అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) చైర్మన్ పదవి తన చేతుల్లో లేదని గంగూలీ పేర్కొన్నాడు. చైర్మన్‌గా ఎన్నికవ్వాలంటే మూడింట రెండో వంతు మెజార్టీ అవసరం లేదని ఐసీసీ బోర్డు నిర్ణయించింది. తాజా సిఫార్సు ప్రకారం.. 51 శాతం ఓట్లు సాధించిన పోటీదారు విజేతగా నిలవనున్నట్లు గంగూలీ తెలిపాడు. కాగా ఈ ఏడాది నవంబర్‌లో ఐసీసీ చైర్మన్ పదవికి ఎన్నికలు జరగనున్నాయి.

Also Read : ఝులన్ గోస్వామిని ప్రశంసించిన గంగూలీ


Next Story

Most Viewed